నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో, దేశంలోనే తొలి ఈ-బస్ బే నిర్మాణం జరుగుతుంది... ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయి... ఈ నెలలోనే దీనిని ప్రారంభించనున్నారు... గుంటూరు నగరంలో, లక్ష్మీపురం మీసేవ జంక్షన్ దగ్గర, "ఈ- బస్‌బే" రానుంది... అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్న, "ఈ- బస్‌బే", మన రాష్ట్రంలోనే కాక దేశంలో మొదటిది... సింగపూర్, రష్యా, మలేషియా దేశాల్లో మాత్రమే ఇలాంటివి అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.... రూ.40 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసే, "ఈ- బస్‌బే" నిర్వహణ, సౌకర్యాలు కల్పించే బాధ్యత అంతా ప్రైవేటు ఏజన్సీ చూసుకుంటుంది...సేవల నాణ్యత, పరిశీలన, నిరంతర పర్యవేక్షణ బాధ్యత మాత్రం నగరపాలకసంస్థ అధికారులే చూడనున్నారు. ...
ఈ బస్ బే ద్వారా ప్రయాణికులకు అందనున్న సేవలను గమనించినట్లయితే.. ఏసీతోపాటు వైఫీ సౌకర్యం ఉంటుంది. ఒకేసారి 50-60మంది ప్రయాణికులు సేదతీరేందుకు అవసరమైన ఏర్పాట్లున్నాయి. ప్రథమ చికిత్సకు అవసరమయ్యే కిట్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఒకేసారి 20మంది తమ ఫోన్లను ఛార్జీంగ్ చేసుకునే వెలుసులుబాటును కల్పించారు. బ్యాంక్ ఏటీఎం సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నారు. భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీస్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేస్తున్నారు.
మరుగుదొడ్లు కూడా ఆధునిక పద్ధతుల్లో నిర్మాణం చేశారు. అంతేగాక, 24గంటలపాటు వాచ్‌మెన్‌లు అందుబాటులో ఉంటారు. 24/7ఆర్వో విధానం ద్వారా శుద్ధమైన తాగునీరు అందుబాటులో ఉంటుంది. ఈ బే చుట్టూ కూడా మొక్కలను పెంచి ఆహ్లాదంగా తయారు చేస్తున్నారు. ఇన్ని అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ఈ బస్ బే త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది.