సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోలవరం ప్రాజెక్టు ఆపాలన్న కేంద్రం లేఖపై అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తున్నారు. బీజేపీ ఆకలితో ఉందని, ఆంధ్రప్రదేశ్‌ను కబలించాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో పట్టు కోసం ఏమైనా చేస్తారు అని, తమిళనాడుపై ఇటీవల కుయుక్తులు పన్నుతోందని, అలాగే ఏపీని కూడా కబళించాలని అనుకుంటోందని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కబళించాలనే ఉద్దేశ్యంతోనే అనవసర సమస్యలు సృష్టిస్తోందని విమర్శించారు.
అందుకే పోలవరం విషయంలో అవసరంలేని సమస్యలు సృష్టిస్తోందని, కేంద్రం చర్యల పై మాకు అనుమానాలు కలుగుతున్నాయని అని అన్నారు. చంద్రబాబును నియంత్రించాలనే ఒక దుర్బుద్ధి ఉందనే అనుమానం కూడా ఉందని అన్నారు.. ‘పోలవరం విషయంలో సీఎం చంద్రబాబు తన స్థాయిని తగ్గించుకుని కేంద్రం చుట్టూ తిరుగుతున్నారని, కాని కేంద్రం మాత్రం చిన్న చూపు చూస్తుంది అని, చంద్రబాబుని చుస్తే బాధ వేస్తుంది అని అన్నారు..
ఆంధ్రప్రదేశ్ ఏమీ వాళ్ల జాగీర్దారు కాదు అని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వారికి బానిసలమూ కాదు అని అన్నారు... పిలిచిన టెండర్లు ఆపాలనడం సరికాదని, పోలవరం ఆపితే దేశంలో అతిపెద్ద తిరుగుబాటు తలెత్తే అవకాశం ఉందని జేసీ అన్నారు... పోలవరానికి సృష్టిస్తున్న ప్రతిబంధకాలు పరిపాలనాపరమైనవి కాకపోవచ్చునని, రాజకీయ కారణాలు ఉండొచ్చునని సందేహం వ్యక్తం చేశారు... ఒకవేళ ఏపీతో వైరం పెట్టుకోవాలని కేంద్రం భావిస్తే... చివరికి వారికే మూడుతుందని తెలిపారు... కేంద్రం వైఖరి ఇలాగే ఉంటే, చంద్రబాబు వద్దు అని చెప్పినా, వ్యక్తిగతంగానైనా సరే పార్లమెంటు సమావేశాలలో నిరసన తెలియచేస్తాను అని అన్నారు...