నిరుద్యోగ భృతి పై కూడా ముందుకు వెళ్ళాలి అని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు... శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది... ఈ సందర్భంగా నిరుద్యోగ భృతిపై చర్చ జరిగింది... శనివారం అసెంబ్లీలో ఈ ప్రతిపాదనను చర్చకు పెట్టి సభ్యుల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయంచారు.. ఆ తర్వాత వివిధ వర్గాలు, ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకొని అప్పుడు తుది రూపు ఇస్తారు...
మంత్రుల కమిటీ సూచనలు ఇవి, ఇంటర్‌ను కనీస విద్యార్హతగా పెట్టాలని మంత్రుల కమిటీ సూచించింది. అప్పటి నుంచే నిరుద్యోగ భృతి ఇస్తే ఆపై చదువును ఆపేసే ప్రమాదం ఉందని, డిగ్రీ కనీస విద్యార్హతగా పెట్టాలని కొందరు మంత్రులు అభిప్రాయపడ్డారు. కనీస వయసు 18 ఏళ్లుగా పెట్టారు. నిరుద్యోగ భృతికి ఇది మరీ తక్కువ వయసని, 21 ఏళ్లు వచ్చిన తర్వాత అప్పటికి అతను నిరుద్యోగిగా ఉన్నాడా లేదా అన్నది స్పష్టత వస్తుందని కొందరు మంత్రులు చెప్పారు. దీంతో మరింత లోతుగా అధ్యయనం చేయాలని సమావేశం నిర్ణయించింది.
అంతే కాదు, వయసులో ఉన్న వారు కూడా, ముసలి వాళ్ళు లాగా, నెల నెలా ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటే, ఇద్దరికీ తేడా ఏంటి ? కష్టపడి పని చేసుకోవాల్సిన వయసులో, ప్రభుత్వం మీద ఆధారాపడి జీవిస్తే ఎలా ? చంద్రబాబు లాంటి విజనరీ నాయకుడు, యువతను ఇలా సోమరిపోతులను చేస్తే ఎలా ? వీటన్నటికీ చంద్రబాబు తనదైన శైలిలో, ఈ పధకాన్ని రూపొందిస్తున్నారు... నిరుద్యోగులకు భృతి చెల్లిస్తూనే, ఆ సమయంలో వివిధ కంపెనీల్లో శిక్షణ ఇప్పిస్తారు. శిక్షణ సమయంలో కంపెనీలు కూడా స్టైఫండ్ ఇస్తాయి. శిక్షణ ముగియగానే అదే కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది. ఆపై కంపెనీ నిబంధనల ప్రకారం వేతనం అందుతుంది. ఆ తర్వాత ప్రభుత్వం నిరుద్యోగ భృతిని నిలిపివేస్తుంది. స్థూలంగా ఇదీ ‘నిరుద్యోగ భృతి’ పథకం అమలు పద్ధతి అని చంద్రబాబు భావిస్తున్నారు... ఇవాళ అసెంబ్లీలో మరింత స్పష్టత రానుంది...