పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆపెయ్యాలి అంటూ రెండు రోజుల క్రితం ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే... ఇది ఇలా ఉండగానే, నిన్న ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ నిన్న తెలంగాణా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తో సమావేశం అయ్యి, పోలవరం నష్టాలు గురించి చర్చించారు.. భువనేశ్వర్‌లో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ శుక్రవారం నవీన్‌ పట్నాయక్‌ను అక్కడ మర్యాదపూర్వకంగా కలిశారు...

polavaram orissa 02122017 1

ఈసందర్భంగా నవీన్‌ పట్నాయక్‌ పోలవరం వల్ల ఒడిశాలో ముంపునకు గురవుతున్న గిరిజన గూడేలు, అటవీ భూముల గురించి కడియం, రామ్మోహన్‌తో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఒడిశాతోపాటు తెలంగాణ, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో చెప్పారు. ఈ విషయాన్ని తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కు చెప్పాలని చెప్పారు.. తెలంగాణలో కూడా గిరిజన గూడేలు ముంపునకు గురవుతున్నాయని నవీన్‌ పట్నాయక్‌ కు కడియం, రామ్మోహన్‌ తెలిపారు... ఈ విషయాన్ని కెసిఆర్ తో చెప్తాం అని చెప్పారు...

polavaram orissa 02122017 3

పోలవరం ప్రాజెక్టును ఒడిశా ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా కర్ణాటక, మహారాష్ట్రలు కూడా చేతులు కలిపాయి. పోలవరంపై ప్రాజెక్టుపై ఆ రాష్ట్రాలు కోర్టుకు ఎక్కాయి. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా కేంద్రం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. అయితే, జాతీయ ప్రాజెక్టుల నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాల్సి ఉంటుంది, అయితే నిర్మాణ బాధ్యతలను చంద్రబాబు తన భుజాన వేసుకన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపించాలని ఒడిశా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ వస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read