చంద్రబాబు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, అధికారంలో ఉంటే, మన ఫోకస్ అంతా అభివృద్ధి మీదే ఉండాలి.... రాజకీయాలు ఎన్నికలప్పుడు మాత్రమే చెయ్యాలి అని... చంద్రబాబుని ఆ అభివృద్ధి, అమరావతి, పోలవరం అనే పిచ్చాలోనే ప్రతిపక్షాలు ఉంచాల్సింది... కాని ఆయన్ను ఇబ్బంది పెట్టటానికి, తీవ్ర స్థాయిలో రాజకీయం చేస్తున్నారు.. చివరకి పోలవరం, అమరావతి లాంటి ప్రాజెక్ట్ లు ఆపటానికి కూడా వేనుకాడుట లేదు... దీంతో చంద్రబాబు మూడో కన్ను తెరిచారు... అభివృద్ధి నుంచి రాజకీయం వైపు అడుగులు వేస్తున్నారు... మొదటి రెండు అడుగులే, ఒక సంచలనం అయ్యాయి... ఒకటి పోలవరం పై కేంద్రం పై ధిక్కారం, రెండు కాపు రిజర్వేషన్...
ఈ రెండు అడుగులతో జగన్, కేంద్రం, ముద్రగడ ఇలా మొత్తానికి చంద్రబాబు ఎర్త్ పెట్టారు... కక్కలేక, మింగలేక ఎలా స్పందించాలో తెలీక, జుట్టు పీక్కుంటున్నారు... ఇవన్నీ డైరెక్ట్ గా ప్రజల ఎమోషన్ తో అటాచ్ అయ్యి ఉన్న సమస్యలు... చంద్రబాబు ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవటంతో, ప్రతిపక్షలకు షాక్ తగిలింది... ముద్రగడ అయితే, ఇవాళ సాయంత్రం దాకా స్పందించలేదు అంటే, చంద్రబాబు ఎలాంటి దెబ్బ కొట్టారో అర్ధమవుతుంది... ఇటు ప్రజలకు మేలు చేసేలా, ఇటు రాజకీయంగా కూడా చంద్రబాబు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు...
రాజకీయ వ్యూహాలు, చతురతలో తనను మించిన వారు లేరని మరోసారి నిరూపించారు చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారే అన్ని అంశాలపై ప్రజలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు... ఇప్పుడు కేంద్రం కోర్ట్ లో పోలవరం, కాపు రిజర్వేషన్ ఉన్నాయి... ఏ మాత్రం తేడా చేసినా, చంద్రబాబు ఉగ్ర రూపం చూపించటానికి రెడీగా ఉన్నారు... చంద్రబాబు లాంటి వ్యక్తి ఎన్డిఏ నుంచి బయటకు వస్తే, అది బీజేపీకి దేశవ్యాప్తంగా ఇబ్బంది అవుతుంది... ఇలాంటి ఛాన్స్ బీజేపీ తీసుకోకపోవచ్చు... మరో పక్క జగన్ అయితే సరే సరి... అసలు తన వ్యూహాలు ఏంటో, ఆ విధానాలు ఏంటో వారికే అర్ధం కావటం లేదు... అసెంబ్లీకి రాకుండా రోడ్లు మీద స్టేజి షోలు చేస్తుంటే, ప్రజలు ఎలా నమ్ముతారని అనుకున్నారో ఏంటో... మొత్తానికి రెండు రోజుల్లో అటు కేంద్రానికి, ఇటు జగన్ కు, మరో పక్క ముద్రగడకి ఊపిరాడకుండా చేస్తున్నారు చంద్రబాబు... అందుకే ఆయన్ను ఇంకొన్నాళ్ళు ఆ అభివృద్ధి అనే పిచ్చలోనే ఉంచాల్సింది... కాని ఇప్పటి నుంచే ఆయన్ను రాజకీయం వైపు తిప్పారు... అనుభవించండి...