పవర్ సెక్టార్ లో చంద్రబాబుని కొట్టేవాడు ఈ దేశంలోనే కాదు ప్రపంచలోనే లేరు అంటే ఆశ్చర్యం కాదు... గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవర్ సెక్టార్ లో రిఫార్మ్స్ తీసుకోవచ్చి, కరెంటు కోతలు లేకుండా చేశారు.... తరువాత 10 ఏళ్ళు అంధకారంలో ఉన్నాం... ఇప్పుడు మళ్ళి ముఖ్యమంత్రి అయిన తరువాత, ఆంధ్రప్రదేశ్ పవర్ సెక్టార్ లోని అన్ని రంగాల్లో టాప్ లో ఉంది... కేంద్ర పవర్ సెక్టార్ లో ప్రకటించే అన్ని అవార్డ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వస్తున్నాయి... కరెంటు కూతలు లేవు... కరెంటు క్వాలిటీ పెరిగింది... కరెంటు కావలసినంత ఉత్పత్తి అయ్యి, మిగులు కరెంటు పక్క రాష్ట్రాలకి అమ్ముకునే స్థాయికి వచ్చాం... ఇప్పుడు సోలార్ లో ప్రపంచంలోనే టాప్ లో ఉన్నాం...
ఇదే ఇప్పుడు దేశానికి ఆదర్శం అయింది... జైపూర్లో జరుగుతున్న అంతర్జాతీయ స్థాయి ఇంధన సామర్థ్య సదస్సులో ఇంధన సామర్థ్యం పెంపు, పొదుపు, ఎల్ఇడీ బల్బుల వాడకంపై ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం 29 రాష్ట్రాలున్నా మన రాష్ట్రానికే లభించటం ద్వారా ఎనర్జీ రంగంలో ఏపీ విజయాలను ప్రపంచం గుర్తించినట్లు స్పష్టమయింది. ఇంధన సామర్థ్య రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, వరల్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ది వరల్డ్ బ్యాంక్ (అమెరికా), కొరియా ఎనర్జీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ప్యారిస్), టోరో (కెనడా), టెరీ సంస్థలు, ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న ఇంధన సామర్థ్య చర్యలపై ఆసక్తి ప్రదర్శించాయి.
ఏపీ ఇంధన సామర్థ్య విధానంతో చేసిన 1781 మిలియన్ యూనిట్ల ఇంధన ఆదా, తద్వారా రూ.982 కోట్ల పొదుపు, కర్బన్ ఉద్గారాలను 1.35 టన్నులకు తగ్గించి మిగిలిన రాష్ట్రాల కంటే ఎంతో ముందున్న వైనానికి అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు లభించాయి. రాజస్తాన్ రాజధాని జైపూర్లో గత నెల 27 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు ఐదు రోజులు నిర్వహించిన ఇంటర్నేషనల్ సింపోజియం టు ప్రమోట్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చి ఇన్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇన్స్పైర్-2017లో పాల్గొన్న అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు మనదేశ ఇంధన సామర్థ్య సంస్థల ప్రతినిధులకు పలు విలువైన సూచనలు చేశారు.