రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటుంటే చాలా మంది నవ్వుతున్నారు... రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ తో, పాలన మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉన్న దొంగలు, 420లు కూడా ఇట్టే దొరికిపోతున్నారు... దొంగలుపడ్డ ఆర్నెల్లకు కాదు, దొంగలు పడ్డ మూడు నిమషాల్లో పట్టేశారు మన ఆంధ్రా పోలీసులు... దొంగోడు ఇంట్లో దూరి, బీరువా తాళాలు బద్దలు కొడుతూ ఉండగానే, వచ్చి పట్టేసుకున్నారు, కడప పోలీసులు.. పోలీసులు కనిపించకూడదు...పోలీసింగ్‌ మాత్రమే కనిపించాలి...రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ కావాలి అంటూ ముఖ్యమంత్రి చెప్పిన మాటని కడప పోలీసులు నిజం చేశారు...

kadapa police 04122017 2

ముఖ్యమంత్రి అభిలాషకు తగ్గట్టు, డీజీపీ సాంబశివరావు గారు లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ అనే సదుపాయాన్ని తీసుకువచ్చారు... ఎవరైనా ఇల్లు వదిలి బయటికి వెళ్లాల్సివస్తే ఎల్‌హెచ్‌ఎంఎ్‌స యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని అందులో వివరాలు నమోదు చేస్తే చాలు. జిల్లా ఎస్పీ, కంట్రోల్‌ రూమ్‌తోపాటు స్థానిక పోలీసులకు సమాచారం అందుతుంది. సంబంధిత పోలీసు స్టేషన్‌ నుంచి ఫోన్‌ వస్తుంది. ఇంటికి వచ్చి పోలీసులు ఎల్‌హెచ్‌ఎంఎ్‌స ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ఇంట్లోకి ఎవరు ప్రవేశించినా పోలీసు కంట్రోల్‌రూమ్‌లో అలారం మోగుతుంది.

kadapa police 04122017 3

నవంబర్‌ 14న కడపలో చిన్నచౌకు ప్రాంతానికి చెందిన మహేశ్‌ అనే వ్యక్తి కుటుంబంతో ఊరెళ్లాల్సి రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. డిసెంబరు 8 వరకూ తన ఇంట్లో ఎల్‌హెచ్‌ఎంఎ్‌స ఏర్పాటు చేయాలని కోరాడు. శుక్రవారం రాత్రి 2.10 గంటలకు ఇంటి తాళాలు బద్దలు కొట్టి దొంగ లోపలికి ప్రవేశించాడు. సైరన్‌ మోగడంతో మూడు నిమిషాల్లోనే ఆ ఇంటికి చేరుకున్న పోలీసులు లోపలఉన్న దొంగను పట్టుకున్నారు. టెక్నాలజీతో పట్టుకున్నారు. మన రాష్ట్రంలో కొంత మంది దొంగలు ఉన్నారుగా, ముఖ్యంగా 420లు కూడా, జాగ్రత్త... రియల్ టైం లో పట్టేస్తారు....

Advertisements

Advertisements

Latest Articles

Most Read