మా అంత గొప్ప పార్టీ లేదు అంటూ ఊరు ఊరు తిరుగుతూ, వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్ ఒక పక్క చెప్తుంటే, వారి పార్టీ నాయకులు దారుణాలు చేస్తున్నారు... సాక్షాత్తు మునిసిపల్ చైర్మన్ గా పని చేసిన వ్యక్తులే అరాచకాలు చేస్తున్నారు... వివరాల్లోకి వెళ్తే, జగ్గయ్యపేట మాజీ మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావును శనివారం విజయవాడ, పటమట పోలీసులు లైంగికదాడి, బెదిరింపు, చీటింగ్ తదితర సెక్షన్ల క్రింద నమోదైన కేనులో జగ్గయ్యపేటలో అరెస్ట్ చేశారు. ఆయనను శనివారం విజయవాడ రెండవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్టేట్ కోరుకు హాజరువర్చగా న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల పాటు రిమాండును విధించారు.
పోలీసులు వివరాల ప్రకారం వటమట డొంకరోడ్డులో నివసిస్తున్న ఒక మహిళ జగన్ పార్టీ పై అభిమానంతో పార్టీలో పనిచేయాలనుకుని, తనకేదైనా పదవిని ఇప్పించమని అడగడానికి కొంత కాలం క్రింద జగ్గయ్యపేటకు చెందిన వైసిపి నాయకులు సామినేని ఉదయభాను ఇంటికి వెళ్ళింది. అక్కడ ఆమెకు తన్నీరు నాగేశ్వరరావు పరిచయమయ్యారు. తనకు వైఎస్ఆర్సిపి పార్టీలో మంచి పలుకుబడి ఉందని, తాను పదవిని ఇప్పిస్తానని ఆమెతో నమ్మబలికాడు. దానికి గాను ఆమె నుండి పలు దఫాలుగా మొత్తం రూ. 40 లక్షలను వసూలు చేశాడు. అంతే కాక తనను శారీరకంగా కూడ వాడుకున్నాడని ఆమె ఆరోపించింది. ఎంతకీ ఏ పదవిని తనకు కట్టబెట్టక పోవడంతో సదరు మహిళ తన్నీరు నాగేశ్వరరావును గట్టిగా నిలదీసింది. ఈ మధ్య కాలంలో కొంత కాలం పాటు మున్సిపల్ చైర్మన్ పదవిలో ఉన్న ఆయన సదరు మహిళ నిలదీయగా దిక్కున్నచోట చెప్పుకోమని, తన జోలికి వస్తే తనతో శారీరక సంబంధం ఉందని ఊరంతా అల్లరి చేస్తానని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.
దాంతో తాను మోసపోయానని గ్రహించి కృష్ణాజిల్లాకు చెందిన నాయకులతో పాటు అధినాయకులను కూడ ఆమె కలిసింది. అయినా ఫలితం దక్కక పోవడంతో చేసేది లేక గత నెలలో నగర పోలీస్ కమీషనర్ గౌతం సవాంగ్ ను కలిసి పై విషయాలన్నీ వివరిసూ తన గోడుని వెళ్ళబోసుకుంది. హుటాహుటిన స్పందించిన సిపి ఆదేశాల మేరకు పటమట పోలీసులు మాజీ మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు పై లైంగిక దాడి, మోసం, బెదిరింపు తదితర సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. శనివారం ఉదయం తన్నీరు నాగేశ్వరరావును జగ్గయ్యపేట లోని ఆయన ఇంటి వద్దే అరెస్ట్ చేసి, విజయవాడ రెండవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్టేట్ కోర్టులో హాజరుపర్చినట్లు పటమట సిఐ తెలిపారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.