స‌మైక్యాంధ్ర‌ప్ర‌దేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కుటుంబం చాలా కాలంగా రాజకీయాల్లోకి దూరంగా ఉంది... అయితే, ఇవాళ వారి రాజ‌కీయ ప్ర‌స్థానంపై క్లారిటీ వచ్చింది... నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇవాళ సాయంత్రం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు... దీని వెనుక చాలా రోజులు నుంచి చర్చలు జరుగుతున్నాయి... మంత్రి అమరనాథ్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి చర్చలు జరిపారు... చివరకు కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పార్టీలోకి వస్తున్నారు... కిరణ్‌కుమార్‌రెడ్డి తదుపరి అడుగుల గురించి మాత్రం, మరింత సమయం పట్టే అవకాసం ఉంది...

krian 16112017 2

నిజానికి కిరణ్‌కుమార్‌రెడ్డి, జనసేనలో చేరుతారని, బిజేపిలో చేరుతారని వార్తలు వచ్చాయి... అయితే జగన్ కూడా తన వంతు ప్రయత్నాలు చేశారు... కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం, జగన్ వెంట వెళ్ళటానికి ఇష్ట పడలేదు.... ఈ క్రమంలో, కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి, ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరటం ప్రాధాన్యత సంతరించుకుంది... మరి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా త్వరలో చంద్రబాబు వెంట వస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది... అనూహ్య రీతిలో ముఖ్యమంత్రిగా 2010 నుంచి 2013 వరకూ పనిచేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి విభజనకు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయాన్ని ధిక్కరించిన సంగతి తెలిసిందే.

krian 16112017 3

ఎట్టి పరిస్థుతుల్లోనూ, జగన్ లాంటి అవినీతి పరుడు వెనుక వెళ్ళే ఉద్దేశం లేదు అని, కిరణ్‌కుమార్‌రెడ్డి వర్గం చెప్తుంది.... ఇక మిగిలింది జనసేన, బిజేపి... ఒక ముఖ్యమంత్రిగా పాని చేసిన వ్యక్తి పవన్ కింద పని చెయ్యటం సాధ్యం అయ్యే పని కాదు అంటున్నారు.... బిజేపి మీద ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో వ్యతిరేకత వస్తున్న నేపధ్యంలో, చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న వారి వెనకాల వెళ్ళటం, కిరణ్ కుమార్ రెడ్డి కి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు అంటున్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read