దాదాపు 20 న్యూస్ చానల్స్... మొన్న విజయవాడలో మొదలైన ఒక ఛానల్ తప్పితే, అన్నీ హైదరాబాద్ నుంచి నడిచేవే.. అక్కడ ఎడిటర్ కాని, స్క్రిప్ట్ రాసే వాడు కాని, వార్తని విశ్లేషించేవాడు కాని అందరూ హైదరాబాద్ లో కూర్చుంటారు... ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ తెలీదు... ఇక్కడ ప్రజలు అభిప్రాయాలు పట్టవ్... వారికి ఒక అజెండా ఉంటుంది, ఆ అజెండా ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యమంగా చంద్రబాబు ఏమి చేసినా రచ్చ రచ్చ చెయ్యాలి... వాళ్లకి తెలంగాణాలో ఏమి జరుగుతుందో అనవరసం... తెలంగాణా గురించి ఒక్క నెగటివ్ వార్తా రాస్తే, అక్కడ కెసిఆర్ 10 కిమీ లోతులో పతి పెడతాడు అని భయం... చానల్స్ ఆపేస్తాడు అని భయం... అందుకే అక్కడ దాసోహం... ఇక్కడ చంద్రబాబు ఏమి అనడు కదా, అందుకే హైదరాబాద్ లో కూర్చుని, మన రాష్ట్రం మీద విషం చిమ్ముతూ ఉంటారు...

news 16112017 2

మా ఆంధ్ర రాష్ట్ర సమస్యలు గురించి మాట్లాడంది... తప్పు లేదు...కానీ నువ్వు ముందు ఆంధ్రుడివా, తెలంగాణ వాడివా తేల్చుకో... హైదరాబాదులో కూర్చుని, ఆంధ్ర రాష్ట్రాన్ని రిమోట్ కంట్రోల్ ద్వారా తిడతామంటే కుదరదు... లాగి పెట్టి లెంపకాయ కొడతాము... మా రాష్ట్ర సమస్య గురించి, మా మీద నిలువెల్లా విషం నింపుకుని, హైదరాబాదు లో కూర్చుని మాట్లాడతాము అంటే మేము వినడానికి సిద్ధంగా లేము. ఈ హైదరాబాద్ బేస్డ్ ఛానెల్స్, వారి అభిప్రాయాలను తీసుకొని, పదే పదే చూపిస్తూ, అదే ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయం అని చూపించడం తప్పు.... ఛానెళ్లూ....ఆంధ్రకు రండి. ఇక్కడ ఆంధ్ర ప్రదేశ్ లో ఆంధ్ర్ ప్రజలు, విశ్లేషకులతో మాట్లాడండి. అంతే హైదరాబాదులో కూర్చొని మా ఆంధ్ర అవార్డుల మీద అవాకులు చావాకులు వాగద్దు... అర్హత లేని చెంచా గాళ్ళని స్టూడియోలో కూర్చో బెట్టి, మా ముఖ్యమంత్రిని, మా రాష్ట్రాన్ని తిట్టేస్తాం అంటే కుదరదు... ఒక్కసారి కుడా మా ఆంధ్రప్రదేశ్ గురించి, మా అమరావతి గురించి పోజిటివ్ గా మాట్లాడక పోగా, రొజూ విమర్శలు చేసే సన్నాసులని స్టూడియోల్లో కూర్చోబెట్టుకుని సొల్లు చెప్పించి, మీ అజెండా మా మీద రుద్దకండి... మా వార్తలు, మా ఆంధ్రా వారి నుంచి ఇవ్వాలి.... మా ఆంధ్ర సమస్యలు, మా ఆంధ్రా గురించి చర్చల్లో, మా ఆంధ్ర వారి అభిప్రాయాలనే ఇవ్వాలి... అంతే కానీ ఆంధ్రాని అనుక్షణం వ్యతిరేకించే వారు కాదు, మా ఆంధ్ర గురించి మాట్లాడేది....

news 16112017 3

ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆలోచించాలి... మా ఆంధ్రా ప్రజల బాధ అర్ధం చేసుకోవాలి... మీ మెతకతనాన్ని అలుసుగా తీసుకుని ..... పక్క రాష్ట్రంలో కూర్చుని ఏ మాత్రం సంబంధం లేకపోయినా నోటికొచ్చినట్టు వాగుతా ఆంధ్ర ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నారు... ఆంధ్రులకి ఆత్మగౌరవం కంటే ఏది ఎక్కువ కాదు.... రాష్ట్రంలో జరిగే ప్రతి విషయం పైన పక్క రాష్ట్రంలో కూర్చుని ,పక్క రాష్ట్రపు వెధవలతో దుమ్మెత్తి పోయిస్తున్న పక్క రాష్ట్రపు చానెల్స్ ని ప్రభుత్వం అదుపు చేయలేదా? కుల మత చిచ్చు పెట్టటమే ఏకైక అజండగా పని చేస్తున్న చానెల్స్ ని ఆపలేదా? మంచితనాన్ని అసమర్థత కింద జమకట్టే మూర్ఖులని, ఉపేక్షించటం సమంజసం కాదు... మీరు రియాక్ట్ అవ్వండి చంద్రబాబు గారు... ఇది ఎంత మాత్రం సమంజసం కాదు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read