విశాఖలో నిర్వహిస్తున్న అగ్రిటెక్ ముగింపు సదస్సుకు సాప్ట్వేర్ దిగ్గజం బిల్‌గేట్స్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే... ముఖ్యమంత్రి మాట్లాడిన తరువాత బిల్ గేట్స్ మాట్లడారు... చంద్రబాబు విజన్ ని, 20 ఏళ్ళ స్నేహాన్ని, ఆ రోజుల్లో జరిగిన విషయాలు గుర్తు చేసుకున్నారు... "నా మంచి ఫ్రెండ్ చంద్రబాబుని కలిసినందుకు సంతోషంగా ఉంది...20 ఏళ్ల క్రితం చంద్రబాబు విజన్ చూసి ఆశ్చర్యపోయా, ఆయన విజన్ చూసి అప్పుడే చాలా ఎక్షైట్ అయ్యానని " సాప్ట్వేర్ దిగ్గజం బిల్‌గేట్స్ చెప్పారు....
నీ కంటే టెక్నాలజీ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న రాజకీయ నాయకుడు ఒకడు ఉన్నారు అని అందరూ నాతో చెప్పే వారు... అప్పుడు అవన్నీ నమ్మ లేదు, కాని ఒక్కసారి చంద్రబాబుని కలిసిన తరువాత, ఆయనతో మాట్లాడితే ఆశ్చర్యపోయాను... టెక్నాలజీ, కంప్యూటర్, డిజిటల్, ఇవన్నీ ఆ రోజుల్లో ఒక రాజకీయ నాయకుడు నోట వినటం, ఆశ్చర్యం అనిపించింది... ఆయనకు టెక్నాలజీ వాడకంతో, ఎలా బాగా గవర్నమెంట్ లో పనులు చెయ్యవచ్చు అనే విజన్ ఉంది... అందుకే ఆయనతో కలిసి పని చేశాం... అది ఒక మైల్ స్టోన్... అని బిల్ గేట్స్ అన్నారు...
మన రాష్ట్రంలో కొంత మంది సన్నాసులని చూసాం... చంద్రబాబు హైటెక్ సిటీ కట్టింది నేనే అంటే, ఇంకా పురిటి వాసన కూడా పోని కొంత మంది పిల్లకాయలు సోషల్ మీడియాలో వెటకారం చేస్తున్నారు... అక్కడి పాలకులు, ఈ రోజు IT అంటే హైదరాబాద్... హైదరాబాద్ అంటే IT అని చెప్పుకుని తిరుగుతున్నారు అంటే, అది ఆ రోజు హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు పొందిన చంద్రబాబు వేసిన పునాది... సాఫ్ట్వేర్ రంగంలో హైదరాబాద్‌ను మేటిగా చేసి, సైబరాబాద్ లాంటి కొత్త నగరాన్ని నిర్మించిన, చరిత్ర మన చంద్రబాబుది ...హైటెక్ సిటీ కట్టే సమయంలోని లాగుల బ్యాచ్ కి, ఇంకా కొంత మంది అమ్మ ఒడిలో పురిటి వాసన కూడా పోని పిల్ల కాకులకి, చంద్రబాబు బిల్ గేట్స్ ని బ్రతిమాలి మైక్రోసాఫ్ట్ పట్టుకొచ్చారని చెప్పినా, హైదరాబాద్ బిర్యానీ వాసనకొచ్చారని వాదిస్తారు.. ఇప్పటి లాగుల బ్యాచ్, రేపు అమరావతికి ఆవకాయ వాసన కోసం, నుజివీడు మామిడి పళ్ళ కోసం, ఉలవచారు కోసం, నెల్లూరు చేపల పులుసు కోసం, వచ్చారు అనే, వాదన తెస్తారేమోనని, ఈ వీడియో పెడుతున్నాం సాక్ష్యం గా...