ఆంధ్రప్రదేశ్ - ది సన్-రైజ్ స్టేట్ ... ఇది ఎదో కొటేషన్ కాదు, ఇది వాస్తవం... ఆంధ్రవాడిని అడ్డుకునే శక్తి ఎవ్వడికి లేదు... ఎన్నో అవమానాలు, సొంత రాష్ట్రంలో, ఒక వర్గం నిట్టూర్పులు... పరాయి రాష్ట్రంలో ఉంటూ, సొంత రాష్ట్రం మీద కుట్ర చేసే సంత..... అసలు ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వగలమా అనే పరిస్థితి... భవిషత్తు శూన్యం... ఏమి జరుగుతుందో తెలీదు, ఎప్పటికి కోలుకుంటామో తెలీదు, మన పిల్లల భవిష్యత్తు ఏమి అవుతుందో అనే ఆందోళన... అలాంటి పరిస్థితిల్లో నుంచి, కారు మబ్బులుని చీల్చుకుంటూ, ఉదయిస్తుంది, మన ఆంధ్రప్రదేశ్... ఇది వాస్తవం, అని ఎన్నో ప్రపంచ స్థాయి సంస్థలు చెప్పాయి, కేంద్రం విడుదల చేస్తున్న ర్యాంకింగ్స్ చెప్తున్నాయి... మన రాష్ట్ర వృద్ది రేటు చెప్తుంది... స్వయంప్రకటిత మేధావులు, రాజకీయ అవకాశవాదులు, కుల గజ్జి మేధావులు, వ్యక్తిగత, స్వార్ధ ప్రయోజనాల కోసం వెంపర్లాడే మీడియా జనాలు, పరాయి రాష్ట్రంలో ఉంటూ, సొంత రాష్ట్రం మీద కుట్ర చేసే సంత ఇలా ఎవరైనా సరే, ఇంత స్పష్టంగా వాస్తవాలు కనిపిస్తున్నా, చూడలేని , అంగీకరించలేని వాళ్లు ఉంటే, వెళ్లి కోడి గుడ్డు మీద ఈకలు పీక్కోవచ్చు...
ఇవిగోండి 2014 నుంచి ఇప్పటి వరకు, 2016 CII సమ్మిట్ లో, 2017 CII సమ్మిట్ లో పనులు ప్రారంభించిన, గ్రౌండ్ అయిన కంపెనీల వివరాలు.... చంద్రబాబు తెచ్చిన పెట్టుబడులు, ప్రశ్నించే వారందరికీ ఇందులో చాలా సమాధానాలు లభిస్తాయి. ఇందులో ఎన్ని ఒప్పందాలు జరిగాయి, ఎంత విలువ, వాటిలో ఎన్ని వాస్తవ రూపం దాల్చాయి, ఎంత మందికి ఉపాధి అవకాశాలు లభించాయి అనే వివరాలు స్పష్టంగా ఉన్నాయి... 2014 నుంచి ఇప్పటి వరకు వచ్చిన కంపెనీల వివరాలు... Source: https://www.apindustries.gov.in/Investment_AP/IndustryCount.aspx?Grid=Industry&LOS=All .... 2014 నుంచి ఇప్పటి వరకు వచ్చిన పెట్టుబడుల వివరాలు... (కోట్లలో).... Source: https://www.apindustries.gov.in/Investment_AP/IndustryCount.aspx?Grid=Investment&LOS=All ..... 2014 నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఉద్యాగాల వివరాలు... Source: https://www.apindustries.gov.in/Investment_AP/IndustryCount.aspx?Grid=Employment&LOS=All .... ప
ఇవి రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు... మేము ఇవి నమ్మం అనుకుంటే, ఇది కేంద్ర ప్రభుత్వం లెక్కలు... http://dipp.gov.in/sites/default/files/Chapter1.4.pdf ... Union Ministry of Commerce & Industry వారి లెక్కల ప్రకారం, 2016లో...భారత దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన ప్రాంతాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2వ స్థానంలో ఉంది... అధికారిక లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో 11,395 కోట్ల ప్రాజెక్ట్ లు గ్రౌండ్ అయ్యాయి... మన పొరుగు రాష్ట్రం అయితే తెలంగాణా సైతం ఈ లిస్ట్ లో 10వ స్థానంలో నిలిచింది... మహారాష్ట్రకు 2016లో 40588 కోట్ల పెట్టుబడులు వస్తే, మన రాష్ట్రము 11395 కోట్లతో రెండవ స్థానంలో, కర్నాటక 9162 కోట్లతో మూడవ స్థానంలో, గుజరాత 8267 కోట్లతో నాలుగవ స్థానంలో ఉన్నాయి... విభజనలో సర్వం కోల్పోయినా...సమర్ధ నాయకత్వం మాకు అండగా ఉంది అన్న నమ్మకమే మా ఆయుధంగా మా రాష్ట్రం అభివృద్ది చెందుతుంది... సమర్ధ నాయకత్వమా...నీకు లాల్ సలామ్!!