దేశంలోనే మొదటిసారిగా, "సోషల్ మీడియా సమ్మిట్ అండ్ అవార్డ్స్ ఫంక్షన్ " నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరగనుంది.... నవంబరు 18, 19 తేదీలలో జరిగే ఈ సమ్మిట్ కు, సోషల్ మీడియాలో చురుకుగా ఉన్న వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అలాగే దాదాపు సోషల్ మీడియాలో చురుకుగా ఉన్న వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల కోసం దాదాపు 30 అవార్డులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వనుంది. బాలీవుడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ఈ ఈవెంట్ గురించి చెప్తూ, అమరావతిలో రెండు రోజుల కార్యక్రమానికి సుమారు 300 మంది ప్రముఖులు హాజరవుతారని, ఆ రోజు సాయంత్రం నుంచి వివిధ కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయన్నారు.
ఈ క్రమంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేకు అవార్డు ఇచ్చేందుకు సిద్ధమైంది. `మోస్ట్ పాపులర్ ఇండియన్ ఆక్ట్రెస్` పేరుతో సత్కరించి, సోషల్ మీడియాలో అత్యంత ప్రాచుర్యం పొందిన భారతీయ నటిగా అవార్డు ఇవ్వనుంది. దీపికతో పాటు అమితాబ్ బచ్చన్ కూడా సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ నటిగా ఎంపికయ్యారు. అమితాబ్ బచ్చన్ ను ` మోస్ట్ పాపులర్ ఇండియన్ `గా అవార్డ్ అందించనుంది ప్రభుత్వం. దక్షిణాది ప్రముఖులు రాణా దగ్గిబాటి, సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ అవార్డులకు ఎంపికయ్యారు.
ఈ అవార్డులు వెనుక ప్రధాన ఉద్దేశం, అమరావతికి మరింత ప్రచారం కల్పించటం, ఆంధ్రప్రదేశ్ లో టూరిజంను ప్రోత్సహించడం - స్టార్ల సందడితో సినీ పరిశ్రమ చూపును నవ్యాంధ్రప్రదేశ్ వైపు పడేలా చేయడం ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమానికి ఎందరో టాలీవుడ్ - కోలివుడ్ - బాలీవుడ్ ప్రముఖులు హాజరుకానుండటంతో, నేషనల్ మీడియా ఫోకస్ కూడా అమరావతి మీద ఉంటుంది అని, తద్వారా అమరావతికి మరింత బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అని, మన అమరావతి గురించి అందరూ మాట్లాడుకుంటారని ప్రభుత్వం ఉద్దేశం...