ఉత్తరాంధ్ర జిల్లాల కార్యకర్తల సమావేశానికి జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇస్తోంటే.. చంద్రబాబు నాయుడు తనను వాడుకుని వదిలేస్తారని కొందరు తనతో చెప్పారని, తనకు ఎవరు ఏంటో తెలియదా? తెలియకుండానే రాజకీయాల్లోకి వస్తామా? అని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్య చేశారు. ఈ రోజు విశాఖపట్నంలో కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు... జవాబుదారీతనం ఉన్న రాజకీయ వ్యవస్థ రావాలని, చంద్రబాబుకు అనుభవం ఉంది కాబట్టే మద్దతిచ్చానని పవన్ పేర్కొన్నారు...
అయినా చంద్రబాబు వాడుకుని వదిలేస్తాడు అంటున్నారు... సొంత మనుషులు అనుకున్నవాళ్లే దెబ్బ కొట్టినప్పుడు బయటవాళ్లు ఎందుకు కొట్టరని ప్రశ్నించారు. ఎవరి అవసరార్ధం వాళ్లు మాట్లాడుతుంటారు. అన్నీ తెలుసు. కానీ మనకు ఓర్పు ఉండాలి...ఎదగడానికే ముందొచ్చిన మహా వృక్షాలకు మోకరిల్లాలని, ఏ పార్టీని తక్కువగా అంచనా వేయనని, ఏపార్టీ అనుభవం ఆ పార్టీదేనని పవన్ పేర్కొన్నారు....
రాష్ట్రం, సమాజం, ప్రజా శ్రేయస్సు కోసమే తాను బీజేపీ-టీడీపీకి మద్దతు ఇచ్చానని చెప్పుకొచ్చారు. పార్లమెంటు తలుపులు మూసేసి రాష్ట్ర విభజన చేయడం వల్లే తాను కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. జగన్ అంటే నాకు వ్యక్తిగతంగా వ్యతిరేకత లేదని, కాని జగన్ చేసిన అవినీతితో తనకి వ్యతిరేకం అని అన్నారు... మార్పు కోసమే జనసేన పార్టీ ఆవిర్భావం జరిగిందని, జనసేన భావజాలాన్ని కార్యకర్తలు ముందుకు తీసుకెళ్లాలని పవన్ పిలుపు ఇచ్చారు....