పోలవరంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకేసారి కౌంటర్ ఇచ్చారు. అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్ళాలి అని, శ్వేత పత్రం విడుదల చెయ్యాలి అని, ఇద్దారు కోరారు.... అలాగే, జగన్ పవన్ పోలవరం గురించి ఎలా ఆలోచిస్తున్నారో కూడా చెప్పారు చంద్రబాబు... పొలవరంపై కొంతమంది శ్వేతపత్రం అడుగుతున్నారని, ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి రోజు ఆన్లైన్లో పెడుతున్నామని చెప్పారు. అడ్డంకులు పెట్టడానికి సాకులు వెతుకుతున్నారని, రకరకాలుగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్దారు. మొన్నటివరకు కాంట్రాక్టర్ను సపోర్టు చేస్తున్నామని విమర్శించారని, ఇప్పుడు కాంట్రాక్టర్ను సపోర్టు చేయడంలేదని అంటున్నారని ముఖ్యమంత్రి అన్నారు...
ఇక్కడ అఖిలపక్షం చేసే పనికంటే... కేంద్రమే చేయాలని అన్నారు. పవన్ ఒక యాంగిల్లో ఆలోచిస్తున్నారని, ఆయన ఆలోచనంతా ప్రాజెక్టు పూర్తి కావాలని... వైసీపి అయితే ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తోందని, మొన్న కూడా లేఖలు రాసి, ఆరోపణలు చేసే పరిస్థితికి వచ్చిందని ఆయన అన్నారు... వైసీపీ నేతలకు ఇప్పటికైనా స్పష్టమైన వైఖరి ఉందా? పోలవరం ప్రాజెక్టు ముందుకు వెళుతోన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి వెళ్లి అభ్యంతరాలు తెలిపింది... గతంలో పట్టిసీమను కూడా అడ్డుకోవాలని చూశారు. ప్రాజెక్టులు ఆపాలని కోర్టులో కేసులు వేశారు అని అన్నారు.
పవన్ కల్యాణ్ ఓ రకంగా ఆలోచిస్తున్నారు.. పోలవరం ప్రాజెక్టు ఎలాగైనా పూర్తికావాలన్నదే ఆయన ఆలోచన. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అలాకాదు.. ఆ పార్టీ నేతలు దీనిపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.. ఏదో ఒక విధంగా ప్రాజెక్టుకు అడ్డంకులు తేవాలి. నేను కూడా చేయలేకపోయానన్న బురద చల్లాలి... ప్రాజెక్ట్ అడ్డుకోవాలని చూస్తున్నారు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మూడురోజుల దక్షిణకొరియా పర్యటన ముగించుకుని నిన్న రాత్రి చంద్రబాబు విజయవాడ చేరుకున్నారు. ఈ రోజు విజయవాడలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.