జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఆయన ఉదయం తొమ్మిది గంటల సమయంలో విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు అభిమానులు, జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఉద్యోగులు డీసీఐ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళకు పవన్ మద్దతు ప్రకటించారు. డీసీఐ ఉద్యోగులకు నైతిక మద్దతు ఇచ్చేందుకు తాను ఇక్కడకు వచ్చానని చెప్పారు. మీ బాధలు పంచుకోవడానికే వచ్చానన్నారు. నష్టాల్లో ఉన్న కంపెనీలను ప్రయివేటీకరణ చేయడం తప్పు లేదన్నారు. కానీ లాభాల్లో ఉన్న డీసీఐని ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.
ఈ సందర్భంలోనే జగన్ మోహన్ రెడ్డి పై డైరెక్ట్ పంచ్ వేశారు పవన్... నాకు అధికార దాహం లేదు... అధికారం విలువ, బాధ్యత తెలుసు.. ముఖ్యమంత్రి అయితేనే సమస్యలు పరిష్కరిస్తానని చెప్పను... ముఖ్యమంత్రి కావలి అంటే అనుభవం ఉండాలి... ప్రజల పక్షాన నిలబడటానికి అధికారం అవసరం లేదు అంటూ పవన్ పరోక్షంగా జగన్ పై వ్యాఖ్యలు చేసారు... జగన్ ప్రతి సందర్భంలోనూ నేనే సియం నేనే సియం అని అంటున్న విషయం తెలిసిందే... పాదయాత్రలో కూడా ఎవరు ఏ సమస్య చెప్పిన, ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ, నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే మీ సమస్య పరిష్కరిస్తాను అంటూ వస్తున్నారు... ఇప్పుడు పవన్ అంటున్న వ్యాఖ్యలు డైరెక్ట్ గా జగన్ కు తగులుతున్నాయి..
మరో పక్క, తాను ఇంత వరకు ప్రధాని మోడీని ఏదీ అడగలేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ ఇప్పుడు డీసీఐ ప్రయివేటీకరణ ఆపాలని కోరుతానని చెప్పారు. ఆశించిన ఫలితం రాకుంటే మీతో కలిసి పని చేస్తానని డీసీఐ ఉద్యోగులకు చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబుకి కూడా, ఆత్మహత్య చేసుకుని చనిపోయిన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు పవన్... తన ప్రసంగంలో కేంద్రాన్ని డైరెక్ట్ గా టార్గెట్ చేసిన పవన్, రాష్ట్ర ప్రభుత్వం పై కూడా వ్యాఖ్యలు చేశారు...