మూడు రోజుల పాటు కొరియా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై, కొరియన్ మీడియా పొగడ్తల వర్షం కురిపించింది... ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు కోసం చంద్రబాబు పడుతున్న తపనతో పాటు, పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు ఇస్తున్న ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధనాలను కూడా మెచ్చుకుంది... అతి పెద్ద కియా మోటార్స్ స్థాపనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా సహకరించింది, సంవత్సరం పడుతుంది అనుకున్న భూమి చదును పనులు, మూడు నెలల్లో చేసి ఇవ్వటం వంటివి కూడా ప్రస్తావించింది...

korea 06122017 1 2

‘కియా మోటార్స్‌ను అడగండి...ఏపీ సమర్ధత ఏంటో చెబుతుంద’ని చంద్రబాబు పారిశ్రామికవేత్తలకు చెప్పిన మాటలు కూడా కొరియన్ మీడియా ప్రముఖంగా ప్రస్తావించింది... ఏపీలో 14 ఓడరేవులను అభివృద్ధి , ఏపీ రెండంకెల వృద్ధి రేటు, వ్యవసాయ రంగంలో 25.6 శాతం వృద్ధి ఇలా ఆంధ్రప్రదేశ్ సాధించిన విజయాలు, ప్రణాలికలు కూడా కొరియన్ మీడియా ప్రస్తావించింది... బిజినెస్‌ సెమినార్‌లో బూసన్‌ వైస్‌ మేయర్‌ కిమ్‌ యంగ్‌వాన్‌ ప్రసంగిస్తూ... చంద్రబాబును డైనమిక్‌ లీడర్‌గా ప్రశంసించటం కూడా అక్కడి పత్రికలు రాశాయి..

korea 06122017 1 3

అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు కానున్న, కొరియా పారిశ్రామికమండలి (ఇండస్ట్రియల్‌ కాంప్లెక్స్‌),‘మేకిన్‌ ఇండియా కొరియా సెంటర్‌’ (ఎంఐసీ), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మధ్య కీలకమైన అవగాహన ఒప్పందం గురించి కూడా అక్కడ పత్రికలు రాశాయి... మొత్తానికి, మన రాష్ట్రం మీద, మన ముఖ్యమంత్రి మీద కొరియా మొత్తం ఒక మంచి పోజిటవ్ వైబ్స్ నడుస్తున్నాయి... కియా మోటార్స్ మన రాష్ట్రంలో రావటం అనేది ఎంత పెద్ద అచీవ్మెంట్ అనేది స్పష్టంగా అర్ధమవుతుంది... కియా

Advertisements

Advertisements

Latest Articles

Most Read