జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర కార్యకర్తలతో విశాఖలో పవన్ సమావేశమయ్యారు... ఈ సమావేశంలో, లోకేష్ దగ్గర నుంచి మోడీ దాకా అందరి మీద అభిప్రాయాలు చెప్పారు... జగన్ మోహన్ రెడ్డిని మాత్రం స్పెషల్ గా ట్రీట్ చేశారు... జగన్ లాంటి అవినీతి పరుడుకు సపోర్ట్ ఇస్తే, ప్రజల పై ప్రభావం ఉంటుందని అందుకే వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు గత ఎన్నికల్లో జగన్‌కు మద్దతు ఇవ్వలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. జగన్ లాంటి వ్యక్తిని సమర్థిస్తే తాను కూడా అలా అవుతానేమోనని భయం వేసిందని అన్నారు. తండ్రి సీఎం అయితే తాను కూడా ముఖ్యమంత్రి కావాలని అనుకోవడం అవివేకమని, ఇది ప్రజాస్వామ్యమా?.. రాచరికమా? అని ప్రశ్నించారు.
రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి దోచుకున్న, లంచాలు తీసుకున్న వ్యక్తి అయితే మొత్తం సమాజం అలా తయారయ్యే అవకాశం ఉందని, అందుకే అన్ని వేల కోట్ల అవినీతి చేసిన జగన్ ని సమర్ధించాలనిపించలేదని, తనకు భయం వేసి... వైసీపీకి మద్దతు ఇవ్వలేదని పవన్ మరోసారి స్పష్టం చేశారు. అంతే తప్ప జగన్‌పై తనకు ఎలాంటి ద్వేషం, వైరం లేదని అన్నారు. తనకు ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక లేదని, ప్రజా సేవ చేస్తానని, అవసరమైతే పాదయాత్ర చేస్తానని అన్నారు. పాదయాత్ర చేస్తే సీఎం అవుతారా..? అని పవన్ సూటిగా ప్రశ్నించారు.
అలాగే లోకేష్ పై కూడా స్పందించారు... లోకేష్ తండ్రి ముఖ్యమంత్రి అందుకే మంత్రి అయ్యారేమో, పార్టీ పదవి వచ్చింది ఏమో... నాకు మా తండ్రి ముఖ్యమంత్రి కాదుగా... మా తండ్రి ఉంటే నాకు తెలేసేదేమో అన్నారు... రాజకీయ నేతల పిల్లలు పొలిటిక్స్‌లోకి రాకూడదని చెప్పలేదని, నిజాయితీని నిరూపించుకుని రావాలని పవన్ అన్నారు... అవినీతి పరులుకి మాత్రం నేను ఎప్పుడూ మద్దతు ఇవ్వను అన్నారు పవన్...