కుట్రలు, మోసాలు, కుతంత్రాలు, నేరపూరిత ఆలోచనలతో నిత్యం పయనించే జగన్ బ్యాచ్ ఇప్పుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద పడింది... పవన్ ఉంటే తనకు కనీసం ప్రతిపక్ష కూడా హోదా కూడా దక్కదు అని తెలిసిన జగన్, చివరకు పవన్ మీద కుట్రలు పన్నారు... జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లాలో లీజుకు తీసుకున్న స్థలం న్యాయపరమైన చిక్కుల్లో ఉంది అంటూ పొద్దున్న నుంచి హడావిడి జరుగుతుంది.. జనసేన పార్టీ కార్యాలయం కోసం మంగళగిరి మండలం చినకాకానిలో 3.42 ఎకరాల స్థలాన్ని మూడేళ్లపాటు పవన్ లీజుకు తీసుకున్నారు. ఈ మేరకు నెలకు రూ.1.50 లక్షలు అద్దె చెల్లించేందుకు యార్లగడ్డ సుబ్బారావు, సాంబశివరావు, అంకినీడు ప్రసాద్‌తో లీజు అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు.
అయితే, ఆ స్థలం తమదంటూ షేక్ షఫి అనే వ్యక్తి తాజాగా మీడియా ముందుకు వచ్చారు. తమదైన ఆ భూమి వివాదంలో ఉందని వివరించారు. అటువంటి భూమిని లీజుకు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఆ స్థలంలో జనసేన పార్టీ కార్యాలయ నిర్మాణం చేపట్టకూడదని షేక్ షఫి డిమాండ్ చేస్తున్నారు. షేక్ షఫి అనే వ్యక్తి తరుపున ముస్లిం ఐక్యవేదిక అనే ఒక వేదిక ముందుకు వచ్చి హడావిడి చేసేంది... అయితే ఈ ఆరోపణలు జనసేన అధికారికంగా ఖండించింది... అసలు దీంట్లో ఇలాంటి కోర్ట్ కేసులు ఏమి లేవు అని, ఇదంతా జగన్ పార్టీ కుట్ర అని చెప్పెంది...
జనసేన చెప్పినట్టే, ఇది జగన్ పార్టీ కుట్ర అని నిరూపణ అయ్యింది... ముస్లిం ఐక్యవేదిక తరుపున హడావిడి చేస్తున్న జలీల్ అనే వ్యక్తి, వైఎస్ఆర్ పార్టీకి చెందిన వ్యక్తి అని తేలింది... ఇది కేవలం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అప్రతిష్ట పాలు చెయ్యటానికి జగన్ పన్నిన పన్నాగం అని తేలింది... 1997లో కోర్ట్ కేసు కొట్టేసింది అంటే, అప్పటి నుంచి ఈ ముస్లిం ఐక్యవేదిక పెద్దలు ఎక్కడ ఉన్నారో మరి ? అసలు వారి పేరు మీద ఇనాళ్లు ఒక్క పన్ను రసీదు లేదు, ఒక్క చోటు కూడా పేరు లేదు... మరో ట్విస్ట్ ఏంటి అంటే, వీళ్ళు చెప్తున్న కేసు నెంబర్ లో A.సుబ్బారావు అనే పేరు ఉంది... ఈ స్థలం యజమాని మాత్రం Y.సుబ్బారావు... లాయర్లు ఇవన్నీ చూసి, ఇది కేవలం అల్లరి చెయ్యటానికి మాత్రమే అని, అసలు పేర్లు వేరు అని, యార్లగడ్డ సుబ్బారావు గారు, పరువు నష్టం దావా కూడా వెయ్యవచ్చు అని సూచించారు...