హైదరాబాద్ అంటే ఐటి ... ఐటి అంటే చంద్రబాబు... ఇది ప్రపంచం మొత్తం చెప్పే మాట... బిల్ గేట్స్ దగ్గర నుంచి, ప్రతి కార్పొరేట్ సర్కిల్ లో చంద్రబాబుకి ఉన్న క్రేజ్ అది... కాని, హైదరాబాద్ లో ఉండే చాలా మంది రాజకీయ ప్రయోజనాల కోసం, ఎప్పుడూ ఆ క్రెడిట్ చంద్రబాబుకి ఇవ్వలేదు... కెసిఆర్, కేటీఆర్ అందరూ ఎగతాళి చేస్తూ మాట్లాడే వారు... కేటీఆర్ అయితే ఏ నాడు చంద్రబాబుకి ఆ క్రెడిట్ ఇవ్వలేదు... హైదరాబాద్ మీద చంద్రబాబు వేసిన ఐటి అడుగులు చెరిపేయటానికి చెయ్యని ప్రయత్నం లేదు... అయితే ఏమైందో ఏమో కాని, కేటీఆర్ మొత్తానికి ఇవాళ హైదరాబాద్ కు ఐటి వచ్చింది అంటే అది చంద్రబాబు చలవే అని ఒప్పుకున్నారు... సైబరాబాద్ సృష్టికర్త చంద్రబాబే అని కితాబు ఇచ్చారు..
ప్రపంచ ఐటీ రంగంలో హైదరాబాద్‌కు స్థానం కల్పించిన ఘనత చంద్రబాబుదేనని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. హైదరాబాద్‌కు ఐటీ పరిశ్రమలు రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. హైటెక్స్ సిటీలో జరిగిన టెక్ మహీంద్రా ఎంఐ-18 వార్షిక ఆవిష్కరణ దినోత్సవానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నాని, ఉపాధ్యక్షుడు ఏఎస్ మూర్తి, నాస్కామ్ ప్రెసిడెంట్ డేబ్జానీ ఘోష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నాని అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ ఆసక్తికర సమాధానాలు చెప్పారు. ‘ప్రపంచంలో ఐటీ హబ్‌గా హైదరాబాద్‌ను నిలపడంలో చంద్రబాబు కృషి అమోఘం. ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు హైదరాబాద్‌కు రావడంతో నా కృషి ఏమీ లేదు. ఆ క్రెడిట్ అంతా చంద్రబాబుకే దక్కుతుంది’ అని కేటీఆర్ అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబుకి విలువ ఇవ్వండి... ఆంధ్రప్రదేశ్ లో ఉండే పిల్లకాయలు కొంచెం చరిత్ర తెలుసుకోండి...