రోజా మళ్ళీ రెచ్చిపోయింది... నిన్న కాక మొన్న, లైవ్ లో బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయిన రోజా, 24 గంటలు తిరగకుండానే పవన్ నుంచి చంద్రబాబు దాకా అందరి మీద తన జుబుక్సాకరమైన మాటలతో విరుచుకుపడింది... పవన్‌కు టీడీపీ గుండు కొట్టించిన మాట వాస్తవమేనని మాట్లాడుతూ, చంద్రబాబుకి కూడా వార్నింగ్ ఇచ్చింది రోజా... మా జగనన్న "ఊ" అంటే మీ పార్టీ ఏమవుతుందో తెలుసా అంటూ చంద్రబాబుని భయపెడుతుంది... ఇందిరా గాంధీ నుంచి రాజశేఖర్ రెడ్డి దాకా పోరాడిన చంద్రబాబుకి చిరవారి జగన్, రోజా లాంటి వాళ్ళు కూడా సవాలు విసురతున్నారు, నీ పార్టీ మూసేస్తాం అంటున్నారు అంటే, బ్యూటీ అఫ్ డెమోక్రసీ అని అనటం తప్ప, ఇంకేమి అనగలం...
టీడీపీలో ఉన్న వారు బయటికి రావాలంటే వైసీపీ అధినేత జగన్ ఎక్కడ తమను రాజీనామా చేయమంటారో అని భయంతోనే వైసీపీలోకి రాలేదని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చారు. రాజీనామా లేదు ఏమీ లేదు వైసీపీలోకి రండి అని జగన్ ఒక్కమాట అంటే తెలుగుదేశం పార్టీ సగం ఖాళీ అవుతుందని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు చాలా మంది నేతలు సిద్ధంగా ఉన్నారన్నారు.
జగన్ నీతి వదిలేసి రాజకీయాలు చెయ్యడు అని, విలువలతో రాజకీయాలు చేస్తాడు అని చెప్పారు… రోజా మాట్లాడిన తీరు చూస్తుంటే, ఈ ప్రపంచంలోనే జగన్ అంతటి నీటి మంతుడు లేడు అన్నట్లు మాట్లాడింది రోజా... జగన్ ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే కోర్టులు ఎప్పుడు పిలిచినా జగన్ వెళ్తున్నారని అంటుంది రోజా... మరి అలాంటప్పుడు ప్రతి శుక్రవారం కోర్ట్ కి వెళ్లి ఎందుకు సంతకం పెట్టి వస్తున్నాడు ?బ బెయిల్ మీద షరతులతో బయట ఎందుకు తిరుగుతున్నాడు లాంటి ప్రశ్నలకు మాత్రం సమాధానం ఉండదు...