ఇదే... అనుభవం, విజ్ఞత, సంస్కారం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి, మూర్ఖపు లక్షణాలు ఉన్న జగన్ మోహన్ రెడ్డికి ఉన్న తేడా.... వీరిద్దరినీ పోల్చటం కూడా సరికాదు... చంద్రబాబు లాంటి నాయకుడితో జగన్ లాంటి వాడికి అసలు పోలికే ఉండదు, కాని అధికార, ప్రతిపక్ష నేతలు కాబట్టి ఇద్దరినీ పోల్చాల్సి వచ్చింది... చంద్రబాబు వ్యవస్థకు, పదవికి ఇచ్చే గౌరవం ఇది.... ఇలాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండటం, నిజంగా ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం, అదే విధంగా ఇలాంటి బాధ్యత లేని ప్రతిపక్ష నాయకుడు ఉండటం మన దౌర్భాగ్యం... అసలు విషయానికి వద్దాం...

cbn jagan 13122017 2

ఇవాళ సమాచార కమిషనర్ల నియామకం సమావేశం జరగనుంది... కమిటీలో సభ్యులుగా సీఎం చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌జగన్‌, మంత్రి యనమల రామకృష్ణుడు ఉన్నారు... అమరావతి రమ్మని ప్రభుత్వం కబురు పంపించింది... కాని జగన్ మాత్రం నేను రాను అని కబురు పంపించారు.. రాకపోగా, నా బదులు వేరే వ్యక్తి వస్తాడు సర్డుకుపోండి అని వర్తమానం పంపించాడు... నిజానికి, జగన్ రాకపోయినా, ప్రభుత్వం ఇష్టానుసారంగా మాచార కమిషనర్ల నియామకం చేసుకోవచ్చు... కాని ముఖ్యమంత్రి అలా చెయ్యలేదు... ప్రతిపక్ష నేత లేకుండా ఇలాంటి నియామకాలు చెయ్యకూడదు అని,మరో అవకాసం ఇద్దామని చెప్పి, సమాచార కమిషనర్ల నియామకంపై ఇవాళ్టి సమావేశం వాయిదా వేశారు...

cbn jagan 13122017 3

మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మళ్లీ సమావేశం తేదీ ఖరారు చేసి జగన్‌కు ప్రభుత్వం సమాచారం ఇవ్వనుంది. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు, భేషిజాలకు పోకుండా, రెండు సార్లు అప్పటి సచివాలయానికి వెళ్లి, ప్రక్రియలో పాల్గున్నారు... కాని, జగన్ మాత్రం, ఎప్పటి లాగే, ఎడ్డెం అంటే తెడ్డెం అంటున్నారు... ప్రతి శుక్రవారం కోర్ట్ కి ఎలా వెళ్తున్నాడో, అలాగే అమరావతి వచ్చి వెళ్ళటానికి జగన్ కు ఇబ్బంది ఏంటో మరి... ఇదే పోగారబోతు నైజంతో ఇప్పటికే ప్రజల ఆదరణ పొందలేక జగన్ రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు, కాని ఆయన నైజం మాత్రం మానటలేదు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read