ఆంధ్రుల ఆశల సౌధం... అమరావతి రూపురేఖలు దాదాపు ఫైనలైజ్ అయ్యాయి... రేపు అధికారికంగా ప్రకటించనున్నారు... చంద్రబాబు సూచించినట్టుగా, రాజమౌళి సలహాలతో, డిజైన్లలో మార్పులు చేసింది నార్మన్ ఫోస్టర్స్... అమరావతి అంటే అది పీపుల్స్ కేపిటల్... అది వన్ అఫ్ ది బెస్ట్ కాదు, ది బెస్ట్ కావలి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో సార్లు మేధో మధనం చేసి, మైన్యూట్ విషయాలు కూడా పర్ఫెక్షన్ వచ్చేలా చేసి, ఎట్టకేలకు డిజైన్ ఫైనల్ చేసారు... అమరావతిలో గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో తలమానికంగా నిర్మించదలచిన అసెంబ్లీ డిజైన్లపై లండన్ నుంచి వచ్చిన మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ ప్లస్ పార్ట్‌నర్స్ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు...
ఈ ఏడాది అక్టోబర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో మంత్రి నారాయణ, రాజమౌళి, సీఆర్‌డీఏ ఉన్నతాధికారులతో కూడిన బృందం లండన్ వెళ్లి మాస్టర్ ఆర్కిటెక్ట్ నిపుణులతో జరిపిన చర్చల్లో అసెంబ్లీకి సంబంధించి రెండు డిజైన్ల పట్ల సుముఖత వ్యక్తం చేసింది. వీటిల్లో ఒకటి చతురస్రాకారపు ఆకృతి కాగా, మరొకటి మధ్యలో పొడవాటి సూదిమొనను పోలిన టవర్‌ను కలిగిన డిజైన్. అయితే మన సంస్కృతి, వారసత్వాలకు అద్దం పడుతూనే మరింత సృజనాత్మకంగా, వైవిధ్యంగా ఆకృతులు ఉండాలని సీఎం కొన్ని మార్పులు సూచించారు. ఆ ప్రకారం సవరించిన డిజైన్లను నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు సీఆర్డీయే ఉన్నతాధికారులకు చూపించారు. అయితే ఎక్కువ మంది టవర్ డిజైన్ పై మొగ్గు చూపారు... హైకోర్టు కోసం గతంలో ప్రతిపాదించిన బౌద్ధ స్థూపాకారపు డిజైన్ ని మరింత ఆకర్షణీయంగా మలచి, ఫోస్టర్ ప్రతినిధులు తాజా సమావేశంలో ప్రదర్శించారు. అంతర్గత నిర్మాణాలు, అంతస్థుల ప్రణాళికలను వివరించారు.
శాసనసభ భవంతి కోసం రూపొందించిన రెండు డిజైన్ లను సమావేశంలో ప్రదర్శించారు. సూది మొన కలిగిన టవర్ రూపంలో ఒకటి, చతురస్రంగా ఉన్న మరో ఆకృతిపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అత్యధికులు టవర్ బిల్డింగ్ వైపే మొగ్గు చూపారు. ఈ రెండు డిజైన్ లను వెంటనే సీఆర్‌డీఏ పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉంచి ప్రజానీకం అభిప్రాయాన్ని సేకరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. గురువారం మరోమారు ఫోస్టర్ బృందంతో సమావేశమై చర్చిద్దామని నిర్ణయించారు. నిర్మాణ, భద్రతాపరమైన అంశాలన్నింటినీ పరిశీలించి ప్రజాభిప్రాయం ప్రకారం తుది ఎంపిక చేద్దామని చెప్పారు. అత్యధికులకు నచ్చిన టవర్ డిజైన్ భవంతిలో కింది భాగంలో శాసనసభ ఉంటుంది. పైన ప్రజలు సందర్శన నిమిత్తం పొడవైన వ్యూయింగ్ టవర్ నిర్మిస్తారు. ఈ తరహా నిర్మాణం ప్రపంచంలోనే వైవిధ్యమైనదని ఫోస్టర్ బృందం పేర్కొంది.