సమర్ధవంతమైన ముఖ్యమంత్రికి, సమర్ధవంతమైన అధికారి తోడైతే ? టెక్నాలజీతో పరిపాలన సాగించి, ప్రజలకు మరిన్ని సేవలు అందిచాలన్న ముఖ్యమంత్రి ఆశయానికి, ప్రభుత్వ ఉద్యోగులు తోడైతే ? ఐఐటీ కాన్పూర్‌లో మెకానికల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ పూర్తి చేసిన అధికారి అయితే ?ఆ రిజల్ట్ ఎలా ఉంటుంది ? మనల్ని పాలించే నాయకులు, అధికారులు, మనకోసమే వినూత్న ఆలోచనలతో, మన ముందుకు వస్తుంటే, అంతకంటే మనకు ఏమి కావలి... ఇలాంటి నాయకులు అరుదుగా ఉంటారు, ఇలాంటి అధికారులు, ఇంకా అరుదుగా దొరుకుతారు.... నవ్యాంధ్రకు అలాంటి ఒక సమర్ధవంతమైన అధికారే నండూరి సాంబశివరావు... ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (APS RTC) మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఆంధ్రప్రదేశ్ డీజీపీగా, తనదైన ముద్ర వేసి, చంద్రబాబు విజన్ కు దగ్గరగా, ఆయన ఆలోచనలకు అనుగుణంగా పని చేసిన వారిలో ముందు వరుసలో ఉండే నండూరి సాంబశివరావు గారికి పదవీవిరమణ శుభాకాంక్షలు...
మొట్టమొదటి సారి ఒక అధికారి మీద ఇంత అభిమానం సామాన్య ప్రజలకు ఉండటానికి కారణం, ఈయన చొరవతోనే, మన గడ్డ నుంచే మన పాలన అంటూ, మొట్టమొదటి డిపార్టుమెంటు హైదరాబాద్ నుంచి మన అమవారతికి తరలి వచ్చింది... తరువాత ఆర్టీసీలో సంస్కరణలు అయితే, ప్రతి ఒక్క పౌరిడుకి చేరువు అయ్యాయి... ఇక పోలీస్ బాస్ గా అయితే చెప్పనవసరం లేదు, ముఖ్యమంత్రి అసలు మన రాష్ట్రంలో నేరాలు జరగకూడదు అని టార్గెట్ ఇస్తే, దాని వైపు అడుగులు వేస్తూ, కడపలో దొంగతనం చేస్తూ ఉండగానే దొంగను పట్టుకోవటం, ఇప్పుడు దేశం అంతా కేస్ స్టడీ అయ్యింది...
1984 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సాంబశివరావు. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సాంబశివరావు ఆంధ్రా యూనివర్సిటీలో (1974-79) ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయన (1979-81 )ఐఐటీ కాన్పూర్‌లో మెకానికల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ పూర్తిచేశారు. 1984లో ఐపీఎ్‌సకు ఎంపికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలీసు శాఖలో పలు కీలక పదవులు చేపట్టారు. విశాఖ పోలీసు కమిషనర్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అలాగే, రాష్ట్రం ఏర్పడిన తర్వాత, అగ్నిమాపక శాఖలో అదనపు డీజీగా, పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా, ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (APS RTC) మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. సమర్థత, సీనియారిటీ ఆధారంగా, చంద్రబాబు, డీజీపీగా సాంబశివరావు వైపు మొగ్గు చూపారు. సాంబశివరావు గారి సామర్ధ్యం నవ్యాంధ్ర ప్రయాణంలో ఎంతో అవసరం... ఈయన్ను చంద్రబాబు వదలరు... ఈయన సేవలు, కచ్చితంగా ఎదో ఒక రూపంలో వినియోగించుకుంటారు... వీడ్కోలు సార్...