అమరావతి వాసులకు నయా ఎంటర్‌టైన్‌మెంట్‌. భవానీ ఐలాండ్ లో ఏర్పాటు చేసిన డ్యాన్సింగ్ మ్యూజికల్ ఫౌంటైన్ అండ్ లేజర్ షో ఆన్ వాటర్ స్కీన్స్ , ఇవాళ క్రిస్మస్ కానుకగా ముఖ్యామంత్రి చంద్రబాబు దీన్ని ప్రారంభించారు. దీ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇటీవల నూతనంగా భవానీ ఐలాండ్ టూరిజం కార్పొరేషన్ (బీఐటీసీ)ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భవానీ ద్వీపం అభివృద్ధి పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ డ్యాన్సింగ్ మ్యూజికల్ ఫౌంటైన్ అండ్ లేజర్ షో ఆన్ వాటర్ స్క్రీన్ దేశంలోనే అతి పెద్దదని బీఐటీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమామహేశ్వరరావు తెలిపారు. నది మధ్యలో, మూడు వాటర్ స్కీన్స్ పై మూడు ప్రాజెక్టర్లతో లేజర్ షో ప్రదర్శితమవుతుందని చెప్పారు. ప్రకాశం బ్యారేజి కంటే ఎత్తులో లేజర్ షో ఉంటుందని వివరించారు.

laser show 2512017 2

ఈ ప్రాజెక్ట్ మొత్తానికి రూ.16 కోట్లు ఖర్చు అయ్యింది... దుర్గమ్మ వైభవం, అమరావతి చరిత్ర, మన రాష్ట్రానికి చెందిన ఘనమైన చరిత్రను లేజర్ షో రూపంలో పర్యాటకులకు చూపించనున్నారు... మ్యూజిక్‌కు అనుగుణంగా లేజర్‌ షో వస్తుంది. ఆ వెలుగుల్లో ఫౌంటెయిన్లు విరజిమ్ముతుంటాయి. ఆ వెలుగుల్లో నది జిగేల్‌మని మెరిసిపోతోంది. చైనాలో కనిపించే లేజర్‌ షో డ్యాన్స్‌ ఇక్కడ ఏర్పాటు కావటం విశేషం.

laser show 2512017 3

ప్రతి రోజూ రెండు షో లు వేస్తారు... ప్రస్తుతానికి టికెట్ ఉచితంగా ఉంచారు... తరువాత సందర్శకులకు టికెట్ పెడతారు... టికెట్ రేట్ ఇంకా నిర్ణయించలేదు.. మ్యూజికల్ ఫౌంటైన్ 32 మీటర్ల పొడవుతో ఏర్పాటు చేశారు. 200 మంది వరకు సందర్శకులు కూర్చునే వీలు ఉంటుంది. సాయంత్రం నుంచి రాత్రి 8 గంటల వరకు ఫౌంటైన్ నిర్వహిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు మొదటి షో ప్రారంభమవుతుంది. మ్యూజికల్ షోతో పాటు, లేజర్ షో కూడా నిర్వహిస్తారు. ఇందు కోసం 460 లైట్లు అమర్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read