ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, జగన్ మోహన్ రెడ్డి ఎంత పరిచయమో, గాలి జనార్ధనరెడ్డి కూడా అంతే పరిచయం... ఎందుకంటే, వీరిద్దరూ కలిసి రాజశేఖర్ రెడ్డి ముఖ్యంత్రిగా ఉండగా, రాష్ట్రాన్ని దోచి పడేసారు... ఇద్దరూ జైలు జీవితం కూడా గడిపి, ఇప్పుడు బెయిల్ పై బయట ఉన్నారు... కర్ణాటక రాజకీయాల్లో ఉన్న గాలి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా ఒకానొక టైంలో శాసించాడు... చంద్రబాబుని మొదటి శత్రువుగా భావించి, అనేక సందర్భాల్లో నోరు పారేసుకున్నాడు కూడా... అయితే, ఉన్నట్టు ఉండి ఇప్పుడు బయటకు వచ్చి ABN రాధాక్రిష్ణకి ఇంటర్వ్యూ ఇచ్చాడు... పూర్తిగా మారిపోయిను అనే భావన కలిగించాడు గాలి...
ఎదావిధిగా ప్రతి ఒక్క అవినీతి పరుడు చేసే వ్యాఖ్యలే చేసాడు... నన్ను అనవసరంగా ఇరికించారు, నేను నిజాయతీకి మారు పేరు అంటూ, చెప్పుకోవచ్చారు... అయితే జగన్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి... మీరు, మీ జీవిత ఆశయం జగన్ ను ముఖ్యమంత్రిని చెయ్యటమే అన్నారుగా అంటే, గాలి సమాధానమిస్తూ, నేను కర్ణాటక రాజకీయాలకే పరిమితం అవ్వాలని నిర్ణయించుకున్నా. వేరే విషయాల్లో వేలు పెట్టదలచుకోలేదు అని తేల్చేసారు. ఒక పక్క ప్రతి శుక్రవారం ఇద్దరూ కోర్ట్ లో కలుసుకుని మాట్లాడుకుంటున్నా, బయటకి మాత్రం, నాకు సంబధం లేదు అని చెప్పారు గాలి.
అలాగే రాజశేఖర్ రెడ్డి గురంచి మాట్లాడుతూ, నాకు సీఎం వైఎస్ కు, తనకు మధ్య ఉన్నది ఓ వ్యాపారవేత్తకు, ప్రభుత్వాధినేతకు మధ్య ఉండేటటువంటి సంబంధమేనని, ఇక వేరే ఏ సంబంధము లేదు అని తేల్చేసారు... రాజశేఖర్ రెడ్డి, గాలి నా పెద్ద కొడుకు అని చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి... మరో ప్రశ్నకు, రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత, నాకు కష్టాలు వచ్చయి అని చెప్పుకొచ్చారు... మొత్తానికి, గాలి మాటలను బట్టి, తనకు వైఎస్ఆర్, జగన్ తో పెద్ద సంబంధాలు లేవు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు... బహుశా తనకు క్లీన్ ఇమేజ్ రావటం కోసం, బయటకు జగన్ తో సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నడు గాలి... రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే గాలి డబ్బుతోనే జగన్ రాజకీయాలు చేస్తున్నారు అనే ప్రచారం ఉంది... ఇప్పుడు పాదయత్ర చేస్తున్న అనంతపురం జిల్లలో, ఖర్చులు అన్నీ గాలి జనార్ధన్ రెడ్డి పెట్టుకుంటున్నారు అనేది బహిరంగ రహస్యం... కాని గాలి మాత్రం, ఎందుకో ఇదివరకటి లాగా, జగన్ తో బయట అంటకాగటానికి ఇష్ట పడటం లేదు...