ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన ట్విట్టర్ ద్వారా మాజీ ప్రధాని, బీజేపీ సీనియర్ నేత, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. "Birthday greetings to Sri Atal Bihari Vajpayee Ji, the Prime Minister who crossed ideological boundaries and won hearts across party lines. He has truly inspired many generations of political and apolitical leaders with his vision for our nation's progress." అంటూ ట్వీట్ చేశారు.

ncbn 25122017 2

మీడియాతో కూడా మాట్లాడుతూ, వాజ్‌పేయి గొప్ప దార్శనికుడు అని కొనియాడిన బాబు మంగళగిరి వద్ద ఎయిమ్స్‌కు ఆయన పేరును సూచించింది తానేనని అన్నారు. వాజ్‌పేయి పాలనాదక్షుడని, పండితుడు, కవి అని అన్నారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే తాను సైబరాబాద్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఫోఖ్రాన్‌లో అణుపరీక్షలు నిర్వహించి భారత సత్తాను ప్రపంచ దేశాలకు చాటారని చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలో మౌలిక రంగ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. వాజ్‌పేయి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

ncbn 25122017 3

భారతరత్న అయిన అటల్ బిహారీ వాజపేయి డిసెంబర్ 25, 1924న గ్వాలియర్ లోని ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వాజపేయి 1996 నుండి 2004 ల మధ్య మూడు పర్యాయాలు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన అనారోగ్య కారణాలవళ్ళ క్రియాశీల రాజకీయాలనుండి తప్పుకున్నారు. ఆయన దేశానికి చేసిన విశేష సేవలకు గానూ భారత ప్రభుత్వం డిసెంబర్ 24, 2014లో భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు. భారత రాజకీయాల్లో మచ్చలేని మనిషిగా కీర్తిగాంచిన వాజపేయి పుట్టిన రోజైన డిసెంబర్‌ 25ను జాతీయ సుపరిపాలనా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read