వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పాదయాత్రకు ఇవాళ అనుకోని బ్రేక్ పడింది... క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు విరామం ప్రకటించారు.. జగన్ సిబ్బంది ఎక్కువ మంది క్రైస్తవులు కావటంతో, పండుగ రోజు కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.. ఇది అన్కోకుండా తీసుకున్న నిర్ణయం కావటంతో, జగన్ శిబిరం రిలాక్స్ అయ్యారు... ప్రతి శుక్రవారం మాత్రమే బ్రేక్ అని ఫిక్స్ అయిన సిబ్బందికి, క్రిస్మస్ పండుగకు సెలవు తీసుకోవటంతో కొంచెం సేద తీరుతున్నారు.. ప్రస్తుతం జగన్ పాదయాత్ర అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. 3వేల కిలోమీటర్లు, ఆరునెలల పాటు జగన్ పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

jagan 25122017

ఇవాళ జగన్ బస చేసిన శిబిరంలోనే జగన్ క్రిస్మస్‌ను జరుపుకోనున్నారు. ఆదివారం రాత్రి ఆయన బస చేసిన శిబిరం వద్దకు తల్లి విజయమ్మ, సతీమణి భారతి, బాబాయి వివేకానందరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు వచ్చి జగన్‌ను కలిశారు. క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పి వారు ఇడుపులపాయకు వెళ్ళిపోయారు. క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా క్రైస్తవ వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు

jagan 25122017

43వ రోజుకు చేరిన జగన్ ప్రజాసంకల్ప యాత్ర గాండ్లపెంట మండలం కటారుపల్లి క్రాస్ రోడ్స్ వద్దకు చేరుకోగానే 600 కిలోమీటర్లకు చేరుకుంది. ఇందుకు గుర్తుగా జగన్ అక్కడ వేప మొక్కను నాటారు. అనంతరం గాండ్లపెంట శివారులో ఏసు కృప చర్చి వద్ద నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. జగన్ పాదయాత్ర రేపు తిరిగి గాండ్లపెంట నుంచి ప్రారంభం అవుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read