నిన్నేమో కర్నూల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చెయ్యట్లేదు అని, తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగం చేస్తుంది, మేము డబ్బు రాజకీయం చెయ్యం, మేము ధర్మం వైపు నిలబడతాం, మేము పోటీ చెయ్యం అనే స్క్రిప్ చదివింది జగన్ పార్టీ. ఇక శిల్పా చక్రపాణి అయితే, నేను వదిలేసిన ఎమ్మెల్సీని, తెలుగుదేశం నాయకులు ఎరుకుంటున్నారు అంటూ హేళనగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు... అక్కడ జరిగిన విషయం ఏంటో అందరికీ తెలిసినా, కొంచం షో చేసాడు శిల్పా.. అయితే ఈ నిర్ణయంతో సొంత పార్టీ కార్యకర్తల్లో గందరగోళం రావటంతో, జగన్ చివరి నిమిషంలో చిన్న గేమ్ ఆడారు...
నిజానికి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చెయ్యటానికి జగన్ కు అభ్యర్ధి లేరు.. అందుకే నోటిఫికేషన్ వచ్చిన తరువాత కనీసం ఒక సమీక్ష కూడా చెయ్యలేదు.. నిన్న అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటున్నాం అంటూ వైసిపి ప్రకటించటంతో, కార్యకర్తలు తీవ్ర నిరాశలోకి వెళ్ళిపోయారు. ఇలాంటి చిన్న ఎలక్షన్ కి కూడా కాండిడేట్ లేకపోతే రేపు 2019 ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో కాండిడేట్ ఎలా దొరుకోటారో అంటూ నిరాశలోకి జారుకున్నారు... విషయం తెలుసుకున్న జగన్, చిన్న గేమ్ ప్లే చేసారు. ఇవాళ ఉదయం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తానని గౌరు వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంపై మాట్లాడేందుకు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలవటానికి అనంతపురం వెళ్తున్నాను అని మీడియాకు చెప్పారు. వెళ్లి కలిసారు కూడా.
యధావిధిగా మీడియా, కర్నూల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్విస్ట్ అంటూ హడావిడి చేసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గౌరు వెంకటరెడ్డి పోటీ చేస్తారు అంటూ హడావిడి చేసింది. , అయితే, పార్టీ నిర్ణయం తీసుకుందని, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని జగన్ ఆయనకు స్పష్టం చేశారు. దీంతో గౌరు వెంకటరెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారు. ఇదంతా కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నంలో చివరి నిమిషంలో అద్భుతమైన డ్రామా వేసారు జగన్... మనకి అభ్యర్ధులు ఉన్నారు, నేనే పోటీ పెట్టటంలేదు అనే ఫీలర్ ఇచ్చారు... 2019లో నేను ముఖ్యమంత్రి అయ్యి తీరుతాను అనే భరోసా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కలిగించారు.