చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం దాకా, అవినీతి బాగా ఎక్కువ ఉండేది. ఇది చంద్రాబాబు మార్క్ పాలన కాదు అని చాలా మందికి అసంతృప్తి ఉండేది... చంద్రబాబు కూడా ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారు... ప్రభుత్వ అధికారులకి ఏమి కావలి అంటే ఇది ఇస్తున్నారు... భారీగా జీతాలు పెరిగినా ఉద్యోగుల్లో అవినీతి మాత్రం తగ్గలేదు... చంద్రబాబు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, ఉద్యోగులు లెక్క చేయలేదు... దీంతో చంద్రబాబు దీని మీద ఫోకస్ చేశారు... ఎలా అయినా ఈ లంచాల అవినీతిని అరికట్టటానికి ప్రణాలికలు సిద్ధం చేశారు... దాదాపు యుద్ధం ప్రకటించారు.. సమర్థవంతుడైన అధికారిగా పేరున్న ఆర్పీ ఠాకూర్‌ను ఏసీబీ చీఫ్‌గా నియమించారు. దీంతో పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్న ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ ఏసీబీ అధికారులను ఉరుకులు పెట్టించారు.
అమరావతి సచివాలయంలోని హోంశాఖ నుంచే అవినీతిపరులపై దాడులు మొదలు పెట్టారు. లంచాలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవటం కాదు, 1100 కి ఫోన్ చేస్తే, లంచం కూడా వెనక్కు ఇప్పిస్తున్నారు... ఇప్పుడు తాజాగా కర్నూలు ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పు దేశంలోనే సంచలనం అయ్యింది.. అవినీతికి పాల్పడేవారినే కాదు, వారికి సహకరించేవారినీ వదలబోమన్న ఏసీబీ.. అన్నంత పని చేస్తోంది. కర్నూలు జిల్లా, బేతంచర్ల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు.. స్థానిక రెవిన్యూ అధికారులపై ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. తన భూమికి సంబంధించిన పాస్ పుస్తకం ఇచ్చేందుకు ఆర్‌ఐ విష్ణు ప్రసాద్, వీఆర్‌వో దస్తగిరి లంచం అడిగారని ఆరోపించాడు.
అతని నుంచి రూ.5వేలు లంచం తీసుకొంటుండగా, రెవిన్యూ అధికారులను ఏసీబీ పట్టుకొని, కేసు పెట్టింది. గట్టిగా ఫిర్యాదు చేసిన శ్రీనివాసులు.. విచారణలో జావగారిపోయాడు. అవతలిపక్షం ప్రలోభాలకు లొంగిపోయారు. కోర్టులో అడ్డం తిరిగాడు. దీంతో కర్నూలు కోర్టు కేసు కొట్టేసింది. అయితే ఏసీబీ సేకరించిన ఆధారాలు, చార్జిషీట్‌తో ఏకీభవించిన కోర్టు.. మాట మార్చిన బాధితుడిపై కేసు నమోదుకు అనుమతిచ్చింది. దర్యాప్తు చేసిన ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలను తాజాగా కోర్టుకు సమర్పించారు. శ్రీనివాసులుకు కోర్టు సోమవారం ఏడాది శిక్షతోపాటు రూ.3వేలు జరిమానా విధించింది. కాగా, కోర్టులో చెప్పిన మాటలను కేసు విచారణలో మారిస్తే, బాధితులకైనా శిక్ష తప్పదని, అనవసరంగా ఫిర్యాదులు చేసినా ఊరుకోబోమని ఏసీబీ చీఫ్ ఠాకూర్ అన్నారు.