నేనే కాబోయే ముఖ్యమంత్రి అంటూ, ముఖ్యమంత్రి కుర్చీ కోసం పాదయత్ర చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, ఎన్నికలు అంటే మాత్రం పారిపోతున్నారు... కర్నూల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. అయితే జగన్ ని మాత్రం రెండు నెలలు క్రిందట జరిగిన ఎన్నికలు గుర్తుకు వచ్చి, ఎన్నికలు అంటే హడలి పోతున్నారు... నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల్లో, కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించింది. ప్రజలు వన్ సైడ్ తీర్పు ఇచ్చారు... జగన్ 15 రోజులు వచ్చి అక్కడే ప్రచారం చేసినా, ప్రజలు మాత్రం జగన్ ను నమ్మలేదు...
ఈ సందర్భంలో కర్నూల్ స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీకి అగ్నిపరీక్షగా నిలిచాయి. ఒక పక్క తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి ఎంపిక కోసం ఇప్పటికే కసరత్తు జరిపింది. చంద్రబాబు విదేశి పర్యటన నుంచి వచ్చిన తరువాత అభ్యర్ధిని ఖరారు చెయ్యనున్నారు.. మరో పక్క జగన్ మాత్రం ఇప్పటి వరకు, అసలు అభ్యర్ధి మీద కసరత్తు చెయ్యలేదు... మరో పక్క శిల్పా చక్రపాణిరెడ్డిని పోటీకు నిలుపుదాం అనుకుంటే, ఆయన ముందే నమస్కారం పెట్టారు... కనీసం జగన్ కు ఫోన్ లో కూడా దొరకటం లేదు... జగన్ ను నమ్మి, నంద్యాల ఎన్నికల్లో నష్టపోయాం అని, ఇటు ఆర్ధికంగా, అటు రాజకీయంగా కూడా నస్యపోయాం అని శిల్పా కుటుంబం వాపోతుంది...
ఈ సందర్భంలో అసలు అభ్యర్ధి కూడా దొరక్క, జగన్ విలవిలలాడి పోతున్నారు.. అభ్యర్ధి కూడా దొరకని పరిస్థుతుల్లో ఉన్నాము అని తెలిస్తే, క్యాడర్ లో తప్పుడు సంకేతాలు వెళ్తాయి అని, ప్రజలు కూడా నమ్మరు అని, అందుకే జగన్ ఈ ఎన్నికలకు దూరంగా ఉండటానికి ప్లాన్ వేస్తున్నట్టు సమాచారం... డైరెక్ట్ గా దూరం అని చెప్తే ప్రజల్లో చులకన అవుతారు కాబట్టి, ఎదో ఒక నెపం చంద్రబాబు మీద నెట్టి, చంద్రబాబు విధానాలకు నిరసనగా మేము ఎన్నికలకు దూరం అని ప్రకటించనున్నారు... అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకుండా ఎలా అయితే చంద్రబాబు మీద నెపం నేట్టారో, అలాగే ఈ ఎలక్షన్ లో కూడా చంద్రబాబు మీద నెపం నెట్టి, ఎన్నికలకు దూరంగా ఉండి, పరువు నిలుపుకోవటానికి జగన్ ప్లాన్ వేశారు.