ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఇది ఒక శుభ పరిణామం... ఒక సంస్కారం ఉన్న నాయకుడు ప్రవర్తించే తీరుకు నిదర్శనం ఇది... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతి పక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యర్ధులు... జగన్, చంద్రబాబు వయసుకి, హోదాకి కూడా గౌరవం ఇవ్వకుండా, ఎన్నో సందర్భాల్లో ఏక వచనంతో సంభోదిస్తూ, బూతులు తిడుతూ, తిట్టిస్తూ, చివరికి ఉరి వెయ్యాలి, కాల్చేస్తాను అని కూడా అన్నారు. అయినా చంద్రబాబు తన సంస్కారం చూపించారు... హుందాతనం చూపించారు... ఇవాళ జగన్ మోహన్ రెడ్డి 45వ ఏట అడుగు పెడుతున్నారు...
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి , సీఎం నారా చంద్రబాబునాయుడు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. మాల్దీవుల్లో హాలిడే లో ఉన్న చంద్రబాబు, ట్విట్టర్ ద్వారా జగన్ మోహన్ రెడ్డికి విషెస్ చెప్పారు... "Wishing you a happy birthday @YSJagan. May God bless you with a happy and healthy life." అంటూ ట్వీట్ట్ చేశారు. జగన్ మరి ఈ ట్వీట్ కు స్పందిస్తారో లేదో చూడాలి.. చంద్రబాబు ఎన్ని వైరాలు ఉన్నా, హుందాతనంగా స్పందించారు... ఇది వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉండగా, సభ లోపలికి జగన్ రాగానే.. జగన్ సీటు వద్దకు వెళ్లిన చంద్రబాబు కరచాలనం చేసి బర్త్ డే విషెస్ చెప్పారు.
ఇప్పటికైనా జగన్ తను ఒక రాజకీయ నాయకుడు అనే విషయం గుర్తుంచుకోవాలి... హుందా రాజకీయాలు చెయ్యాలి అని కోరుకుందాం... రాజకీయాల్లో ఎన్నో విమర్శలు ఉంటాయి, కాని హుందాగా ఉంటే అందరికీ మంచిది... ప్రజలకు కూడా మంచి సందేశం వెళ్తుంది... ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టిన ట్వీట్ కి చాలా మంది రిప్లై ఇస్తూ, ఇలాంటి హుందా రాజకీయాలు కావలి అని కోరుకుంటున్నారు... జగన కూడా హుందాగా స్పందించి, మంచి సంప్రదాయానికి నాంది పలకాలని కోరుకుంటున్నారు... జగన్ కు ఇష్టం లేక పోయినా, కనీసం ఆ ప్రశాంత్ కిషోర్ అన్నా సలహా ఇచ్చి, చంద్రబాబుకి విషెస్ చెప్పినందుకు ధ్యన్యవాదుఅలు చెప్పాలి అని కోరుకుంటున్నారు...