గోదావరి-పెన్నా అనుసంధానానికి ముందడుగు పడింది. 320 టీఎంసీల గోదావరి మిగులు జలాలను పెన్నాకు తరలించే ఈ ప్రాజెక్టుకు సంబంధించి లైడార్, హైడ్రోగ్రాఫిక్ సర్వే పూర్తికాగా, జియోటెక్నికల్ అధ్యయనం ముగింపుదశకు వచ్చింది.గోదావరి-పెన్నా అనుసంధానం ద్వారా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తాగు-సాగు నీరు, పరిశ్రమలకు నీటి సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ పథకం పూర్తయితే ఆరు జిల్లాల్లోని పట్టణాలకు, గ్రామాల్లోని చెరువులకు, ఇతర రిజర్వాయర్లకు గోదావరి మిగులు జలాలు తరలించేందుకు వీలు కలుగుతుంది.
గోదావరి-పెన్నా సంగమ ప్రాజెక్టుపై శుక్రవారం సచివాలయంలోముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకువాప్‌కాస్ లిమిటెడ్(WAPCOS)నివేదిక సమర్పించింది. ప్రాజెక్టు పూర్తికావడానికి సుమారురూ. 80 వేల కోట్ల వ్యయం కానుందని, 320 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోతల పథకం ద్వారా తరలించేందుకు 3,625 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని ‘వాప్‌కాస్’ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు.ఈ మహత్తర పథకం పూర్తికావాలంటే32 వేల ఎకరాల భూమిని సేకరించాల్సి వుందని, ఇందులో 7 వేల ఎకరాల అటవీ భూమి వుందని తెలిపారు. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ మధ్యలో రెండు సొరంగాలు తవ్వాలని, బొల్లపల్లి దగ్గర రిజర్వాయర్ నిర్మించాలని ముఖ్యమంత్రికి వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి సంగం బ్యారేజ్ వరకు 701 కి.మీ. మేర కాలువలు నిర్మించాల్సి వుంటుందని చెప్పారు.
వరద నీటిని ప్రకాశం బ్యారేజ్ నుంచి కొమ్మమూరు కాలువ మీదుగా పెదగంజాంకు,అక్కడ నుంచి ఎత్తిపోతల ద్వారా గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు,ఆ తర్వాత సంగం బ్యారేజ్‌కు తరలించడంపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు.సత్వర ఫలితాలు సాధించేలా దశలవారీగా గోదావరి-పెన్నా అనుసంధానం పూర్తి చేయాలని, కాలువల నిర్మాణ వ్యయం తగ్గేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. గోదావరి-పెన్నా అనుసంధానంలో భాగంగా మొదటి దశ కిందప్రస్తుతం వున్న కాలువలు, రిజర్వాయర్ల ద్వారా వీలైనంత వేగంగా ఎంతమేర జలాలను తరలించవచ్చో అధ్యయనం చేయాలని చెప్పారు. ఈ సంగమం సంపూర్ణమైతే రాష్ట్రంలో సుమారు 1,500 టీఎంసీల వరకు జలాలను నిల్వ చేసుకునేందుకు అవకాశం కలుగుతుందని అన్నారు.