ప్రపంచ తెలుగు మహాసభల పేరు మీద తెలంగాణా మహాసభలు నిర్వహిస్తున్న కెసిఆర్ ప్రభుత్వం, మరో సారి తన నైజాన్ని బయట పెట్టింది... ప్రపంచ తెలుగు మహాసభలు అని పేరు పెట్టుకుని, పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం ఆహ్వానం కూడా పంపలేదు.. బహుసా కెసిఆర్ చదివన 80 వేల పుస్తకాల్లో ఎక్కడా ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడతారు అని తెలీదు ఏమో... కెసిఆర్ ప్రపంచ తెలుగు మహాసభలు అని చెప్పగానే, సరిహద్దులకు అతీతంగా తెలుగువారందరూ పాల్గొనేలా చేసి రాష్ట్రాలుగా విడిపోయినా.. జాతిగా, సాంస్కృతికంగా కలిసే ఉన్నాం అన్న స్పృహను కల్పిస్తారు అని అందరూ భావించారు...
కాని కెసిఆర్ ఎప్పటిలాగే తన బుద్ధి బయట పెట్టాడు... మొన్న ఇవంకా వచ్చిన సదస్సుకి కూడా, చంద్రబాబు వస్తే తన కొడుకుని ఎవరూ పట్టించుకోరు అని ఆహ్వానం ఇవ్వలేదు... ఇవాళ కూడా చంద్రబాబు వస్తే, ఫోకస్ మొత్తం ఆయన వైపు వెళ్తుంది అని, ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చరిత్ర, తెలుగు కవలు పేర్లు చెప్తారు అని భయంతో, తన తెలంగాణా చరిత్ర మాత్రమే వినిపించాలి అనే ఉద్దేశంతో, చంద్రబాబుని దూరం పెట్టాడు... తెలుగు మహాసభలో తెలుగు సంస్కృతి, భాష పరిరక్షణకు ఉద్దేశించి కాబట్టి పక్క తెలుగు రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రిని, మంత్రుల్ని, ప్రజా ప్రతినిధులని పిలవాల్సిన అవసరం అనుకోవటం అతని కుసంస్కారానికి నిదర్సనం... మరో పక్క, కేవలం కెసిఆర్ వల్ల రాష్ట్రం ఈ పరిస్తుతుల్లో ఉంది అని తెలిసినా, కెసిఆర్ ఆంధ్రా వాళ్ళని అమ్మనా బూతులు తిట్టినా, అమరావతి శంకుస్థాపనకు కెసిఆర్ ని ఆహ్వానించిన సంస్కారి చంద్రబాబు...
తెలుగు భాష అంటే రెండు రాష్ట్రాల భాషా అన్న నిజాన్ని ఇవాళ తుంగలో తొక్కారు. తెలంగాణా కూడా భాషాపరంగా చరిత్ర కలిగిన రాష్ట్రమే ... సందేహం లేదు. కానీ, ఆంధ్రా లో ఎంతో మంది భాషా సేవకులు, మేధావులు, పండితులు ఉన్నారు. చరిత్ర ఉంది... అసలు వారి ఉసే లేదు... అసలు ఆంధ్ర , తెలంగాణా ప్రాంత వాసులంతా తెలుగు వారే ... రెండు రాష్ట్రాలు కలుపుకుని జరుపుకునే ఉత్సవాలు ఇవి ... అది గుర్తుంచుకోవాలి ఈ కెసిఆర్ లాంటి నాటకాలు అడే రాజకీయ నాయకులు ఇది తెలుగు జాతికే అవమానం... తెలంగాణా మహాసభులు అని పెట్టుకుంటే, నిన్ను అడిగేవాడే ఉండడు... తెలుగు అని చెప్పి, నీ ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడితే, కుదరదు.. ఇది చరిత్ర... నువ్వు ఎంత దాచినా దాగదు...