కొన్ని రోజుల కృతం విజయవాడ మాచవరంలో, తెనాలకి చెందిన రౌడీషీటర్ కాళిదాసు హత్య కేసుని పోలీసులు చేధించారు... ఈ హత్య జరిగిన వెంటనే, ఈ హత్య చేసింది విజయవాడ తెలుగుదేశం నేత కాట్రగడ్డ శ్రీను అంటూ, వైసిపి నేతలు, సాక్షి మీడియా రచ్చ రచ్చ చేసింది... అయితే, పోలీసులు విచారణలో ఈ హత్య చేసింది వైసీపీకి చెందిన వారే అని తేలింది... ఈ హత్య కేసులో కూడా టెక్నాలజీ బాగా ఉపయోగపడింది... వీడియో ఎనలైటిక్స్ సహాయంతో, వీరు రెక్కీ నిర్వహించటం దగ్గర నుంచి, హత్య చేసి పారిపోయే దాకా, అన్నీ పక్కగా చేదించారు పోలీసులు.. వందకు పైగా సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి, వీడియో ఎనలైటిక్స్ ద్వారా పట్టుకున్నారు..
గ్రూపు తగాదాలు, పాత కక్షలే సుబ్బు హత్యకు కారణమని తేల్చారు. ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న తొమ్మిదిమంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఏడుగురు రౌడీషీటర్లు. నిందితుల్లో సురేంద్ర భార్య తెనాలిలో వైసీపీ తరపున కౌన్సిలర్‌గా గెలుపొందారు. కౌన్సెలర్ స్థాయి నాయకులు హత్యలు చేస్తున్న వైసిపి నేతలు, దొంగే దొంగా దొంగా అని అరిచినట్టు, ఎదురు తెలుగుదేశం నేతల పై ఆరోపణలు చెయ్యటం, నిజం అని నమ్మించటం, సోషల్ మీడియాలో, సాక్షి మీడియాలో పదే పదే ఈ హత్య తెలుగుదేశం నేత కాట్రగడ్డ బాబు చేసినట్టు చెప్పి ప్రజలని తప్పుదోవ పట్టించారు...
ఈ హత్య కేసుకు సంబధించి విజయవాడ పోలీసు కమీషనర్ గౌతం సవాంగ్ ఘాటుగా స్పందిచారు... విజయవాడ నగరం మొత్తం నిఘాలో ఉంది. మాస్క్‌లు వేసుకున్నా, హెల్మెట్లు పెట్టుకున్నా వెంటనే దొరికిపోతారు. ఒక మనిషి అన్ని కోణాలనూ ఈ కెమెరాలు చూపిస్తాయి. ప్రోగ్రాంకి ఒక్క టాగ్ ఇస్తే నేరగాళ్లు ఎక్కడున్నారో తెలిసిపోతుంది అని కమీషనర్ అన్నారు... అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేసును చేదించామని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని, నేరాలు కూడా జగకుండా చూస్తాం అని, మరిన్న పవర్ఫుల్ టెక్నాలజీ టూల్స్ అందుబాటులోకి వస్తున్నాయి అని, జాగ్రత్తగా ఉండాలి అని, హెచ్చరించారు...