ఈ నెలలో మన అమరావతికి విశిష్ట అతిధి వస్తున్నారు... ఆయనే సింగపూర్ ప్రధాని లీ... సింగపూర్ ప్రధాని మన అమరావతిలో అడుగుపెట్టబోతున్నారు... జనవరి 26న భారత రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గునటానికి అతిధిగా వస్తున్నారు సింగపూర్ ప్రధాని.. ఈ సందర్భంగా అమరావతి పర్యటనకు కూడా రానున్నారు... ఈ మేరకు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలకి సమాచారం అందించారు... పోయిన సంవత్సరం సింగపూర్ ప్రధాని అమరావతి రావాల్సి ఉండగా, అది వాయిదా పడింది... ఎట్టకేలకు సింగపూర్ ప్రధాని అమరావతి రావటానికి మార్గం సుగుమం అయ్యింది..
సింగపూర్ ప్రధాని అమరావతి వస్తారు కాబట్టి, ఆయనతో పాటు మన ప్రధాని నరేంద్ర మోడీ కూడా రావాల్సి ఉంటుంది... అది ప్రోటోకాల్ ప్రకారం తప్పదు అని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి... ఎప్పుడో అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని ఒక చెంబుడు నీరు, మట్టి తీసుకువచ్చారు... అదే విధంగా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అప్పాయింట్మెంట్ కూడా ఇవ్వటంలేదు అనే వార్తలు వస్తున్నాయి... ఎన్నో సందర్భాల్లో రాష్ట్రానికి రావాలని ఆహ్వానించినా ప్రధాని మోడీ తిరస్కరించారు అనే వార్తలు కూడా వచ్చాయి... ఇప్పుడు సింగపూర్ ప్రధానే అమరావతి పర్యటన ఖరారు చెయ్యటంతో, ఆయనతో పాటు మోడీ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది... ఆయనకు ఇష్టం లేకపోయినా ఇక రాక తప్పదు...
అయితే, ఇదే సందర్భంలో అమరావతిలో నిర్మించే గవర్నమెంట్ కాంప్లెక్స్ భవనాలకు సింగపూర్ ప్రధానితో పాటు, మన ప్రధాని మోడీ చేత శంకుస్థాపన చేపించే అవకాశం కూడా ఉంది అని సమాచరం... సచివాలయం, హై కోర్ట్ భవనాలకు ఇటీవలే, నార్మన్ ఫాస్టర్ డిజైన్ లకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే... ప్రస్తుతం ఇంటర్నల్ గా డిటైల్డ్ డిజైన్ లు తయారు అవుతున్నాయి.. అవి రాగానే టెండర్లు పిలేచేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది... ఈ నేపద్యంలో సింగపూర్ ప్రధాని చేత శంకుస్థాపన చేపిస్తే, ప్రపంచ వ్యాప్తంగా ఫోకస్ వచ్చి, ఇంటర్నేషనల్ మీడియాలో కూడా అమరావతి గురించి ఫోకస్ వస్తుంది అని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం...