ఒక్కటే గోవు (దేశీయ ఆవు)... దాని పేడ, మూత్రంతో 30 ఎకరాల్లో ఎలా పంట పండిస్తున్నారు... ఎకరాకు 50, 60 బస్తాలు పంట ఎలా రాబడుతున్నారో పది రోజుల పాటు పదివేల మంది రైతులకి శిక్షణ ఇవ్వబడుతుంది... పేడ, మూత్రం తో చేసిన జీవామృతమే పెట్టుబడి... కూలి ఖర్చు ఒక్కటే రైతు భరించేది. వ్యవసాయం లాభసాటిగా తీసుకెళ్ళాలి అనే ధ్యేయంతో చంద్రబాబుగారి ప్రయత్నంలో భాగమే ఈ కార్యక్రమం... ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నారా ? ప్రకృతి సేద్యం పై రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతలు, జనవరి 8 వరకు, ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ గారి అధ్వర్యంలో గుంటూరు నాగార్జునా యూనివర్సిటీ ఎదురు బైబిల్ మిషన్ గ్రౌండ్లో జరుగుతున్నాయి...

subhash 31122017 2

రాష్ట్ర ప్రభుత్వం దీని కోసం 7 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన రైతులు ఇక్కడకు వచ్చి పెట్టుబడి లేని వ్యవసాయం పై శిక్షణ తీసుకోనున్నారు... సుభాష్ పాలేకర్ గారు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు పై, జీవామృతం, ఘన జీవామృతం, ఆవు మూత్రం, పేడలను ఉపయోగించి సేద్యం చేయడం, పెట్టుబడి లేని వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత పెంచటం, మన విత్తనాలు మనమే తయారు చేసుకోవటం వంటి అంశాల పై శిక్షణ ఇస్తారు.

subhash 31122017 3

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం గుంటూరులో ప్రకృతి వ్యవసాయ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రకృతి సేద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏదంటే.. అది ఆంధ్రప్రదేశ్‌గా ఉంటుందని అన్నారు. ఇది దేశానికి కాకుండా ప్రపంచానికే ఒక చిరునామాగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. 2018 ఏపీకి ప్రకృతి సేద్యం ఇయర్‌గా నామకరణం చేసుకుంటున్నామని, అందరూ దీనిపై శ్రద్ధ పెట్టాని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. లక్షా 50 వేల ఎకరాల్లో ఒక్క పైసా పెట్టుబడి లేకుండా ప్రకృతి సేద్యం చేసే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆయన అన్నారు. పాలేకర్‌ ఏపీలో వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థాపించాలని కోరారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read