అప్పుడెప్పుడో ప్రజారాజ్యం పెట్టిన టైంలో, అల్లు అరవింద్, మేము 292 నియోజకవర్గాల్లో గెలుస్తున్నాం, మిగతా రెండు స్థానాలు చంద్రబాబు, వైఎస్ఆర్ గెలుస్తారు అని చెప్పిన మాట గుర్తుందా ? పోనీ, మొన్నా మధ్య ఒక బీజేపీ పెద్ద మనిషి, 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రిని నేనే డిసైడ్ చేస్తా అన్నారు గుర్తుందా ? ఇప్పుడు మరో ఇయర్ ఎండింగ్ జోక్, ఈ కోవాలనే పేల్చాడు జగన్ పార్టీ ఎమ్మల్యే కొడాలి నాని... ఇయర్ ఎండింగ్ కిక్ లో ఉన్నాడో ఏమో, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 170 స్ధానాల్లో వైకాపా విజయం సాధించి తీరుతుందని, జగన్ ముఖ్యమంత్రి అయిపోతాడు అని కొడాలి నాని ఛాలెంజ్ చేసి చెప్పారు...
నిన్న కాక మొన్న, కర్నూల్ ఎమ్మల్సీ స్థానానికి అభ్యర్ధి దొరక్క చేతులు ఎత్తేసిన జగన్ పార్టీ, ఇప్పుడు ఏకంగా 175 స్థానాలకు, 170 స్థానాలు గెలిచి జగన్ ముఖ్యమంత్రి అయిపోతాడు అని కొడాలి నాని సెలవు ఇవ్వటంతో, రాజకీయ విశ్లేషకలు బుర్ర గోక్కుంటున్నారు... ముందు 175 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను నిలిపితే అదే పది వేలు అని, అయినా కొడాలి నాని, ఇక్కడతో ఆపాడు, నేను హోం మంత్రి అవుతాను అని చెప్పలేదు అని అంటున్నారు... అయినా 175 స్థానాలకు, 175 స్థానాలు చెప్పాల్సింది, పాపం ఆ 5 ఎందుకు వదిలిపెట్టాడో, ఇంతకీ ఆ గెలిచే 5 మంది ఎవరో అని గుసగుసలాడుతున్నారు..
గన్నవరం నియోజకవర్గం నున్నలో ఏర్పాటు చేసిన పల్లె నిద్ర, రచ్చబండ కార్యక్రమంలో వంగవీటి రాధ, దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి పాల్గొన్నారు. నున్న కూడలిలో పార్టీ జెండా ఎగురవేసి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ నాని ఈ వ్యాఖ్యలు చేసారు... ఇక్కడ మరో కామెడీ ఏంటి అంటే, గన్నవరం నియోజకవర్గం నుంచి నేను పోటీ చెయ్యలేను అని దుట్టా రామచంద్రరావు చెప్తే, నెల రోజుల క్రిందట యార్లగడ్డ వెంకట్రావు అనే అతనిని ఎక్కడ నుంచో తెచ్చి ఇక్కడ రుద్దుతున్నారు... వీళ్ళు 175 స్థానాలకు, 170 స్థానాలు గెలుస్తారు అంట... మరి ఇది ఇయర్ ఎండింగ్ జోకే కదా ?