ముఖ్యమంత్రి చంద్రబాబు పోయిన సంవత్సరం నూతన సంవత్సర వేడుకలకు ఒక కొత్త సాంప్రదాయానికి తెర లేపారు... అదే సంప్రదాయం కొనసాగిస్తూ, తనతో పాటు పనిచేసే ఐ.ఏ.ఎస్., ఐ.పీ.ఎస్.,ఐ.ఎఫ్.ఎస్ ఆఫీసర్లు, క్రింద స్థాయి ఉద్యోగస్తులు, వారి కుటుంబంతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు తన సతీమణితో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే వారు... కృష్ణానదిలోని భవానీ ద్వీపంలో ఏర్పాటు చేసిన లేజర్ షోను సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తిలకించారు. లేజర్ షోతో ప్రజలకు చక్కటి వినోదం ఆహ్లాదం పంచుతున్నందుకు పర్యాటక శాఖను ప్రశంసించారు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి.. లేజర్ షో అద్భుతంగా ఉంది అని చెప్తూ, ముఖ్యమంత్రికి ఒక సలహా ఇచ్చారంట భువనేశ్వరి...
లేజర్ షోలో విజయవాడ చరిత్ర, దుర్గమ్మ వారి చరిత్ర ఇవన్నీ ఇప్పుడు చూపిస్తున్నారు... ప్రత్యేకమైన రోజుల్లో చాలా మంది ప్రజలు వస్తారు కాబట్టి, వీటితో పాటు ఆ రోజు ప్రాముఖ్యత వివరిస్తూ లేజర్ షో ఉంటే బాగుంటుంది అని సలహా ఇచ్చారు అంట... ఉదాహరణకి వినాయక చవతి రోజున, వినాయకుడు కధ, క్రిస్మస్ రోజున జీసస్ గురించి ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పారు అంట.. దానితో పాటు, ప్రతి రోజు అమరావతి గొప్పతనం, దాని చరిత్ర కూడా ఒక ఘట్టం ఉంటే బాగుంటుంది అని సలహా ఇచ్చారు..
ఇవన్నీ విన్న చంద్రబాబు, అక్కడ ఉన్న టౌరిజం డిపార్టుమెంటు వారికి కూడా చెప్పి, సాధ్యాసాధ్యాలు పరిశీలించమని చెప్పారు అని సమాచారం... ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా తాను కొనసాగడానికి తన భార్య భువనేశ్వరి ఇస్తున్న మద్దతే కారణమని చంద్రబాబునాయుడు చెప్పారు. రాజకీయాల్లోనే కాదు, ఏ రంగంలో అయినా సుదీర్ఘ కాలం పాటు కొనసాగడానికి కుటుంబసభ్యుల మద్దతు తప్పనిసరిగా ఉండాల్సిందేనని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. భార్య సహకారం లేకపోతే కుటుంబ సభ్యులు, ముఖ్యంగా భార్య సహకారం లేకపోతే పురుషులు తమ రంగాల్లో పూర్తి స్థాయిల్లో విజయం సాధించలేరని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.