కేంద్ర ప్రభుత్వం అహ్మదాబాద్, నాగ్పూర్, లక్నో, చెన్నై (ఎక్ష్టెన్షన్), పూణే, నోయిడా-గ్రేటర్, నోయిడా, ఢిల్లీల కోసం తొమ్మిది కొత్త మెట్రో ప్రాజెక్టులను మంజూరు చేసింది. 180 కీమీ పొడువు ఉన్నీ అన్ని మెట్రోలకి, 49 వేల కోట్ల ఖర్చు అవ్వనుంది. ఈ జాబితాలో మన రాష్ట్రం నుంచి విశాఖపట్నం లేదా విజయవాడ రెండూ లేవు... రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో విజయవాడ మెట్రో కోసం ప్రయత్నాలు చేస్తున్నా, కేంద్రం ఎప్పుడూ వాటిని తిరస్కరిస్తూ వస్తుంది. అందుకే ఇప్పుడు, లైట్ మెట్రో మీద అధ్యయనం జరుపుతుంది రాష్ట్ర ప్రభుత్వం... దీనికి కూడా కేంద్రం అంగీకరిస్తుందో లేదో తెలీదు...

kendram 01012018 2

ఇక వైజాగ్ అయితే అన్ని అర్హతలు ఉన్న నగరం... కాని వైజాగ్ ని మెట్రో లిస్టు లో చేర్చలేదు... నాగపూర్ కంటే ఎక్కువ జనసాంద్రత కలిగి ఉన్న ప్రాంతం వైజాగ్... నాగపూర్ కి మెట్రో ని కేంద్రం ఆమోదించింది కాని, వైజాగ్ మాత్రం లిస్టు లో లేదు... చెన్నైలో మెట్రో రైలు పెద్ద ఫ్లోప్ అయిన సంగతి తెలిసిందే... ఇప్పుడు చెన్నైలో మెట్రో రైలు పొడిగింపుకి అంగీకరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో బిజెపి బలపడాలి అనుకుంటున్న తరుణంలో, చెన్నై నగరానికి ప్రత్యెక దృష్టితో చూస్తూ, చెన్నై నగరానికి మెట్రో పొడిగిస్తూ ఆమోదించింది... కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 9 మెట్రోల్లో, దక్షిణ భారత దేశంలో చెన్నై ఒక్కటే ఉంది.. అది కూడా పొడిగింపు...

kendram 01012018 3

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం మెట్రో రైలు ప్రాజెక్టులు విజయవాడ, విశాఖపట్నంలకు రావాల్సి ఉంది. కానీ బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ రెండు ప్రాజెక్ట్ లను ఇప్పటి వరకు ఆమోదించలేదు. పైగా రాష్ట్ర ప్రభుత్వం డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపినా, అది లేదు, ఇది లేదు అంటూ, చివరకు మెట్రోకి పర్మిషన్ ఇవ్వలేదు... అందుకే రాష్ట్ర ప్రభుత్వం లైట్ మెట్రో వైపు అడుగులు వేస్తూ, బయట నుంచి లోన్ తెచ్చుకుని ఈ ప్రాజెక్టులను అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. మొత్తం మీద, 49 వేల కోట్ల ప్రాజెక్ట్ ల్లో, దగా పడ్డ ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క పైసా కూడా లేకుండా, కేంద్రం మరోసారి అన్యాయం చేసిందనే చెప్పాలి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read