తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అక్రమ ఆస్థులు సంపాదించారని, సిబిఐ, ఈడీ జగన్ పై 11 కేసులు పెట్టిన సంగతి తెలిసిందే... అన్నిట్లో జగన్ A1గా ఉన్నారు... 16 నెలలు జైలు శిక్ష కూడా అనుభవించి, ఇప్పుడు బెయిల్ పై బయట తిరుగుతూ, ప్రతి శుక్రవారం కోర్ట్ కి వెళ్తూ, ఎక్కడకి వెళ్ళాలి అన్నా కోర్ట్ పర్మిషన్ తీసుకుంటూ వెళ్తున్న సంగతి తెలిసిందే... ఈ 11 కేసుల్లో, 3 కేసులు విచారణ త్వరలో ముగియనుంది అనే సమాచారం కూడా వస్తున్న తరుణంలో, ఇవాళ సుప్రీమ్ కోర్ట్ చెప్పిన వ్యాఖ్యలతో జగన్ కు వణుకు మొదలైంది...
రాజకీయ నేతలపై కేసుల విచారణలో వేగాన్ని పెంచేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇదివరుకే కోరింది... ఇవాళ కేంద్రం దాని పై స్పందించింది... పార్లమెంటు, శాసనసభల సభ్యులపై కేసుల విచారణ కోసం ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు అంగీకరిస్తున్నట్లు సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది... రాజకీయ నేతలపై కేసుల్లో విచారణ ఒక ఏడాదిలో పూర్తయ్యేవిధంగా, తీర్పులు వెలువడే విధంగా ఈ కోర్టుల ఏర్పాటు జరగాలని సుప్రీం కేంద్రానికి తెలిపింది.
ప్రారంభంలో 12 ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తామని కేంద్రం సుప్రీంకు తెలిపింది. వీటి కోసం రూ.7.80 కోట్లు కేటాయించినట్లు వివరించింది. దేశవ్యాప్తంగా ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలపై పెండింగ్‌లో ఉన్న కేసుల సమాచారాన్ని తెలుసుకుని, అవసరమైన ప్రత్యేక కోర్టుల సంఖ్యను నిర్థారించేందుకు తమకు కొంత సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరింది. జగన్ కేసులు తీవ్రత తీసుకుంటే, మొదటి స్థానంలో ఉంటాడు... అంటే ఇప్పుడు సుప్రీం చెప్పిన ప్రకారం, మరో ఏడాదిలో జగన్ కేసుల విచారణ మొత్తం అవ్వాల్సిందే...