రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టును కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈనెల 22వతేదీన సందర్శించనున్నారని వార్తలు వస్తున్నా నేపధ్యంలో, రేపే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి గడ్కరీని కలవటం హాట్ టాపిక్ గా మారింది... కొద్దిసేపటి క్రితం టెలిఫోన్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు మాట్లడారు... అయితే అనూహ్యంగా, రేపే పోలవరం ప్రాజెక్టు పై కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు....
ఒక పక్క రేపు అమరావతి డిజైన్లు ఫైనల్ చెయ్యటానికి నార్మన్ ఫాస్టర్ తో మీటింగ్ ఏర్పాటు చేసారు ముఖ్యమంత్రి చంద్రబాబు... అయితే, ఆ మీటింగ్ కూడా కాన్సిల్ చేసుకుని, రేపు ఢిల్లీ వెళ్లనున్నారు... అనుకోని ఈ పరిణామంతో, ఒక్కసారిగా మళ్ళీ పోలవరం పై వేడి పెరిగింది... రొటీన్ ప్రాసెస్ లో భాగంగానే చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారా ? లేక ఇంకా ఏమైనా విషయం ఉందా అనేది అధికారులకి కూడా అర్ధం కావట్లేదు... అయితే ఈనెల 22న పోలవరం ప్రాజెక్టును కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వచ్చి సమీక్ష చెయ్యనున్న నేపధ్యంలో, ముఖ్యమంత్రి ముందుగానే వెళ్లి, అన్నీ వివరించి, మరిన్ని అనుమతులు, నిధుల కోసం గడ్కారీతో చర్చించి, 22న పోలవరంలోనే కొన్ని కీలక ప్రకటనలు చేపించటానికి ముఖ్యమంత్రి ముందుగానే వెళ్లి అన్ని విషయాల మీద క్లారిటీ ఇవ్వనున్నారు అని తెలుస్తుంది...
ఇప్పటికే నితిన్ గడ్కరీ అనుకున్న సమయంలోగా ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. ఏపీ సర్కార్ కు అన్ని విధాలా సహకారం అందిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనులు పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులన్నీ క్లియర్ చేస్తున్నామన్నారు. మరి రేపటి ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన పోలవరం విషయంలో మరింత స్పష్టత వస్తుందో లేదో చూడాలి...