ఈయన పేరు షాన్ కెల్లీ... ఆస్ర్టేలియన్ కాన్సులేట్ జనరల్... అమరావతిలో, ఆస్ట్రేలియా పెట్టుబడులు పెట్టేందుకు, ఈయన ఎంతో సహకరిస్తున్నారు... ఈ మూడేళ్లలో ఆయన 16 సార్లు అమరావతికి వచ్చారు... అనేక అంశాల పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చించారు... జనవరిలో పదవీ విరమణ చేయనున్న ఆయన.. సోమవారం చివరిసారిగా ఇక్కడకు వచ్చారు. సీఎం చంద్రబాబు, అధికారులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు...
ఈ సందర్భంగా ఆయన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో, ముఖ్యమంత్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు..." రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును తొలిసారి కలిశాను. ఆయన అత్యంత డైనిమిక్ లీడర్. ఆయన విజన్ అత్యద్భుతం. నేను తొలిసారి ఆయన్ను కలిసినప్పుడు కొన్ని ప్రతిపాదనలు చెప్పాను. వాటిపై అప్పటికప్పుడే లోతుగా పలు ప్రశ్నలు అడిగారు. తర్వాత అందులో కొన్నిటికి సరేనన్నారు. వాటిపై ముందుకెళ్లేందుకు ఇప్పటివరకు 16 సార్లు ఆయనతో సమావేశమయ్యా. ఆయన పనిచేసే తీరు ఇతరులకు ఆదర్శం. ప్రతి కొత్త విషయాన్నీ ఆకళింపు చేసుకుంటారు. ఇప్పుడు అమరావతితో ఆస్ర్టేలియా బంధం బలమైన పునాదులపై ఏర్పడింది" అని అన్నారు...
ఆస్ట్రేలియన్ కంపెనీలు, విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో కలిసి వచ్చి అనేక సార్లు ముఖ్యమంత్రితో పెట్టుబడులకు అవకాశాలపై చర్చలు చేశాం. కొన్ని చోట్ల పెట్టుబడులు పెడుతున్నాం. మరికొన్ని చోట్ల సహకారం అందిస్తున్నాం. ఈ బంధం భవిష్యత్‌లోనూ కొనసాగుతుంది. ముఖ్యమంత్రికి అర్ధరాత్రి వరకు పనే. అలా పనిచేస్తూనే ఉంటారు. ఆయన అత్యంత విశ్లేషణాత్మక నాయకుడు అని షాన్ కెల్లీ అన్నారు... రాష్ట్రంలో అపార ఖనిజ వనరులున్నాయని, ఈ రంగంలో ఆస్ట్రేలియా టెక్నాలజీపరంగా చాలా ముందుందని, దీన్ని ఆంధ్రప్రదేశ్ కి అందిస్తాం అని అన్నారు. కర్నూలు జిల్లాలో స్టీల్ ప్లాంట్ నెలకొల్పుతున్నామని, ఎన్ఏఎ్సఎల్ కంపెనీ దీన్ని నెలకొల్పుతుంది అని చెప్పారు. . ఆస్ట్రేలియా, చైనాలోని ఒక కంపెనీతో పాటు ఏపీ ప్రభుత్వం ఇందులో భాగస్వాములుగా ఉంటాయని అన్నారు.. పూర్తి వివరాలు త్వరలో చెప్తామని అన్నారు..