పోలవరం ప్రాజెక్టు ఖర్చుకు సంబంధించిన లెక్కలన్నీ శాసనసభలో వెల్లడించామని, అదే ఒక శ్వేతపత్రం వంటిదని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమ చెప్పారు. పోలవరంలో అవినీతి జరిగిపోయిందని ప్రతిపక్షం గగ్గోలు పెడుతోందని, అసలు గుత్తేదారులకు ఎంత చెల్లించామో వారికి తెలుసా? అని మంత్రి ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టులో 2014 తర్వాత ప్రధాన ప్రాజెక్టులో ఎంత ఖర్చు చేసింది, గుత్తేదారులకు ఎంత ఇచ్చిందీ ఆయన వివరించారు. ఇప్పటి వరకు 7.50 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పని, 4.38కోట్ల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని పూర్తి చేశాం అంటున్నారు దేవినేని ఉమా.. పోలవరం ప్రాజెక్టుకు ఖర్చుపెట్టిన ప్రతీ రూపాయికి ఆన్‌లైన్‌లో వివరాలు ఉన్నాయని, ఎవరైనా చూడవచ్చని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

polavaram 10122017 2

మంత్రి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పునరావాసంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటి వరకు 680 బిల్లులకు 2380.76 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 158 బిల్లులకు 153.44 కోట్లు కలిపి మొత్తం రూ.2,544.13 కోట్లు చెల్లించామన్నారు. ప్యాకేజీ నగదు ఆయా రైతుల ఖాతాల్లోనే జమ చేశామని, ఎక్కడా అవినీతి జరిగే అవకాశం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టులో పునరావాసం, భూసేకరణకు సంబంధించి మొత్తం రూ.2,534 కోట్ల బిల్లులన్నింటినీ సమీకరించి జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌, పునరావాస కమిషనర్‌ ద్వారా హైదరాబాద్‌లోని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి పంపే ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఉన్న వీటన్నింటి ప్రతులు సేకరించి 846 బిల్లులను పుస్తకాల రూపంలోకి మార్చి అథారిటీ కోరిక మేరకు పంపుతున్నారు.

polavaram 10122017 3

మొత్తం ఖర్చు: రూ.7,431 కోట్లు... కేంద్రం ఇచ్చింది: 4,324 కోట్లు... (గడ్కరీ తాజాగా రూ.318కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు)... ఇంకా కేంద్రం నుంచి రావాల్సింది: రూ.2,894 కోట్లు... గుత్తేదారులకు ఇచ్చింది: రూ.1,590 కోట్లు... ట్రాన్స్‌ట్రాయ్‌కు : రూ.654 కోట్లు... త్రివేణి (మట్టి తవ్వకాలు): రూ.656 కోట్లు... ఎల్‌అండ్‌టీ బావర్‌ (డయాఫ్రంవాల్‌): రూ.205 కోట్లు... బెకం (గేట్ల తయారీకి): రూ.69 కోట్లు... కెల్లర్‌ అడ్వాన్సు( కాఫర్‌డ్యాం జెట్‌ గ్రౌటింగ్‌ పనులకు) రూ. 5 కోట్లు... భూసేకరణ, పునరావాసం: రూ.2,534 కోట్లు ...

Advertisements

Advertisements

Latest Articles

Most Read