రాజకీయాలు ఎలా ఉన్న, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పని తనం గురించి ఎవరికీ ఇబ్బందిలు ఉండవు... అభివృద్ధి అంటే అంది చంద్రబాబుతోనే సాధ్యం అని ప్రత్యర్ధులు కూడా ప్రశంసిస్తూ ఉంటారు... రాష్ట్రంలో ఎన్నో కొత్త ప్రాజెక్ట్ లు జరుగుతున్నాయి... ప్రతి ప్రాజెక్ట్ ఎదో వంకతో లేట్ అవుతుంది... ఎవరో ఒకరు ఎదో ఒక అలజడి రేపి, ప్రాజెక్ట్ ఆలస్యానికి కారణం అవుతున్నారు.... ఇదే విషయం నిన్న ప్రెస్ మీట్ లో చంద్రబాబు చెప్పారు... ప్రాజెక్టుల పూర్తి విషయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు...
మేము ఎంతో గ్రౌండ్ వర్క్ చెయ్యటం, ఆ ప్రాజెక్ట్ విషయంలో 99.9 శాతం మంది ప్రజలు సహకరించటం, చివర్లో ఒకడు వెళ్లి కేసు వెయ్యటం, ప్రాజెక్ట్ లేట్ అవ్వటం... ఇదే జరుగుతుంది అంటూ ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో ఆవేదన చెందారు... ప్రతి ప్రాజెక్ట్ లో అడ్డుపడుతుంది ఒక్కరేనా సార్ ? దీంట్లో రాజకీయ ప్రయోజనం ఉంది అంటారా అని అడగగా, చంద్రబాబు స్పందిస్తూ, ఆ ఒక్కరూ ఎవరో మీకు తెలుసుగా అని బదులు ఇచ్చారు.. సమాజంలో అంతా బాగుంటే ఓర్వలేనివారు, అత్యాశపరులు కొందరుంటారు... వారే ఇలాంటివి చేస్తారు అని అన్నారు... విలేకరులు ఎంతగా ఆ పేరు చెప్పిద్దాం అని చూసినా, చంద్రబాబు మాత్రం, పేరు బయటకు చెప్పకుండా, అతను ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసులే అని అన్నారు...
పోలవరం ప్రాజెక్ట్ పై కూడా ముఖ్యమంత్రి స్పందించారు... కాంట్రాక్టరు ఎవరు? టెక్నికల్‌గా ఏంటి? అప్పర్ కాఫర్ డ్యాం ఉంటుందా? లేదా? ఇవన్నీ అనవసరం, మనకు పోలవరం ప్రాజెక్టు పూర్తికావాలి... కేంద్రానికి చాలా ప్రాజెక్టులు ఉండొచ్చని... రాష్ట్రానికి జీవనాడి ఒక్క పోలవరం ప్రాజెక్టేనని చెప్పారు. రెండు, మూడు ఆప్షన్లు కేంద్ర ప్రభుత్వం సూచిస్తుంది. టెక్నికల్ డిజైన్లు ఎలా ఉండాలన్నది కేంద్రం ఇష్టం. మాకు ప్రాజెక్టు పూర్తి కావడమే ముఖ్యం అని ముఖ్యమంత్రి అన్నారు...