కేంద్రంలో మొన్నతిదాక రాష్ట్రానికి పెద్ద దిక్కు ఆయినే... ఎన్ని ఇబ్బందులు ఉన్నా, అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ, రాష్ట్రానికి చేతనైంది చేసేవారు వెంకయ్య నాయుడు... మంత్రిగా ఉన్నప్పుడు, తన సొంత శాఖలోనే కాదు, మిగతా శాఖల్లో కూడా రాష్ట్రానికి అధిక కేటాయింపులు వచ్చేలా చూసేవారు ... ఆయన ప్రాతినిధ్యం వహించిన పట్టణాభివృద్ధి శాఖలో చేతనైన సహాయం చేశారు... రాష్ట్రానికి ఇళ్ళ కేటాయింపు, అండర్గ్రౌండ్ డ్రైనేజికి నిధులు, అమరావతికి స్మార్ట్ సిటీ హోదా... ఇలా ఎన్నో పనులు చూసుకునే వారు... ఇలా ఉండగానే ఉప-రాష్ట్రపతిగా వెళ్ళిపోయారు... దీని వెనుక చాలా ఊహాగానాలు వినిపించాయి... ఏదేమైనా జరగాల్సింది జరిగిపోయింది... నష్టం మాత్రం రాష్ట్రానికి జరిగింది...
అయితే వారు ఊహించింది వేరు... ఉప రాష్ట్రపతి అంటే ఎదో రబ్బర్ స్టాంప్ అనుకున్నారు... మనం చెప్పినట్టు విని, రెస్ట్ తీసుకుంటారు అనుకున్నారు.. రాజ్యసభని మైంటైన్ చేయటం అనుకున్నారు... ఇదివరకటి లాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేలు పెట్టరు అనుకున్నారు... కాని ఇప్పుడు అంతా రివర్స్ లో జరుగుతుంది... కొన్నాళ్ళ వరకు సైలెంట్ గా ఉన్న వెంకయ్య, మళ్ళీ పాత ఫార్మ్ లోకి వచ్చారు... టైం దొరికితే రాష్ట్రానికి వచ్చేస్తున్నారు... 15 రోజుల టైం గ్యాప్ లో, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి, రాష్ట్రంలో మూడు కార్యక్రమాల్లో పాల్గున్నారు...
అంతే కాదు, ఉప రాష్ట్రపతి హోదాలో రాష్ట్రానికి సంబంధించిన కీలక పనుల పై రివ్యూ చేస్తున్నారు... కేంద్ర మంత్రుల్ని, సీనియర్ అధికారులని పిలిపించుకుని అన్ని విషయాల పై చర్చించారు... పోలవరం పై సమీక్ష చేశారు... కడప జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన ఉక్కు పరిశ్రమ పై రివ్యూ చేసారు... నిజానికి ఇప్పుడు ఆయన హోదా వేరు.. మొన్నటి వరకు కేంద్ర మంత్రి మాత్రమే.. ఇప్పుడు ఉప రాష్ట్రపతి హోదాలో ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చి చెప్పాల్సిందే, ఆయన అడిగినవి చెయ్యాల్సిందే... ఈ పరిణామాలతో మోడీ, అమిత్ షా ఒకింత అసహనంగా ఉన్నారు.. ఒక పక్క అటు నుంచి సహాయ నిరాకరణ చేసి చంద్రబాబుని ఇబ్బంది పెడుతుంటే, ఈయన ఇలా చెయ్యటం ఏంటి అంటూ ఇబ్బంది పడుతున్నారు... అటు బయటకి గెట్టిగా చెప్పలేరు, లోపల ఆ బాధని దాచుకోలేరు... మొత్తానికి, కొంత కాలం సైలెంట్ గా ఉన్న వెంకయ్య, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహాయం చెయ్యటంలో మళ్ళీ ఆక్టివ్ అయ్యి, బీజేపీ పెద్దలను ఇబ్బంది పెడుతున్నారు..