జగన్ పేరు నేషనల్ లెవెల్ లో మారు మోగుతుంది... నేషనల్ మీడియాలో జగన్ చేసిన ఘనకార్యాలు గొప్పగా చెప్తున్నారు... జగన్ పాదయాత్రలో నీతులు చెప్తూ, నాకు అవినీతిని అంతం చేసే కసి ఉంది, అవినీతి పరులని జైలులో పెడుతా, అవినీతిని సహించను, నాకు నిజాయితీ ఉంది, నేను ధర్మంగా ఉంటాను అని డైలాగులు మీద డైలాగులు చెప్తుంటే, దర్యాప్తు సంస్థలు, కోర్ట్ లు, జగన్ వాస్తవ రూపాన్ని బయట పెడుతున్నాయి... నిన్న ఈడీ జగన్ ఆస్తులు అటాచ్ చేసిన నేపధ్యంలో, మనోడి టాలెంట్ మరోసారి నేషనల్ మీడియాలో మారు మోగింది... చాలా రోజులు తరువాత జగన్ ని నేషనల్ మీడియాలో చూసిన దేశ ప్రజలు, ఇంకా శిక్ష వెయ్యలేదా అంటూ మాట్లాడుకుంటున్నారు...
ప్రధానంగా "ET Now" "TOI" చానల్స్ తో పాటు, జాతీయ వార్తా పత్రికల్లో కూడా జగన్ ఘనకార్యాలు గురించి వేసారు... ఒక పక్క ముఖ్యమంత్రి కొత్త రాష్ట్రం పేరు నిలపటానికి, అందరి దృష్టి ఆకర్షించి పెట్టుబడులు కోసం దేశాల్లో ప్రచారం చేస్తుంటే, మనోడు మాత్రం తను చేసిన ఘనకార్యలతో మన రాష్ట్ర పరువు తీస్తున్నాడు... అందులోనూ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత అనే హోదా కూడా ఉంది... దీంతో ఒక నాయకుడు రాష్ట్ర ప్రతిష్టని పెంచుతుంటే, ఇంకో నాయకుడు రాష్ట్ర ప్రతిష్టని దిగజారుస్తున్నాడు..
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కంపెనీల్లోకి పెట్టుబడుల రూపంలో నిధులు మళ్లించి అప్పటి వైఎస్ ప్రభుత్వం నుంచి భారీగా లబ్ధి పొందిన ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి, ఆయనకు సహకరించిన మరో రెండు సంస్థలకు చెందిన రూ.117 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ మేరకు బుధవారం సుదీర్ఘ ప్రకటన విడుదల చేసింది. ‘ఇందూ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌కు చెందిన వివిధ స్థిరాస్తులు, ఎంబసీ ప్రాపర్టీ డెవలప్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (జితేంద్ర వీర్వాణి), వసంత ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు (వీవీ కృష్ణప్రసాద్) చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్లను పీఎంఎల్‌ఏ కింద జప్తు చేశాం. వీటి విలువ రూ.117.74 కోట్లు. వైఎస్ జగన్, ఇతరులపై దాఖలు చేసిన 11 ఛార్జిషీట్లకు సంబంధించిన కేసుల్లో ఈ జప్తు చేశాం." అంటూ ఈడీ తెలిపింది.