రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దయతో ఆయన చూపుతో మేము మనుషులమయ్యామని రాయలసీమ హిజ్రాల అధ్యక్షురాలు హాసిని పేర్కొన్నారు. పులివెందులలో బుధవారం జరిగిన జన్మభూమి గ్రామసభలో ఆమె మాట్లాడారు. హిజ్రాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ. 1500 పింఛన్ తో పాటు ఇళ్ల స్థలాలు, చదువును బట్టి ఉద్యోగం తదితరాలను కల్పించడం ఎంతో ఉన్నతాశయమన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఆనాడు రాముని కాలు తగిలి రాయి అహల్యగా మారిందని, నేడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి చూపు మా పై పడి మేము మనుషులుగా మారామన్నారు.

hijra 04012018 2

హిజ్రాలకు ఇళ్ల పట్టాలు, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. రాష్ట్రంలో 3 లక్షల మంది హిజ్రాలు ఉన్నారని, మా ఓట్లను ఆయనకే అన్నారు. సమాజంలో వివక్షకు గురవుతున్న హిజ్రాల పై, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మానవతా కోణంలో ఆదుకుంటుంది... వివిధ వర్గాల ప్రజలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి కృషి చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పుడు హిజ్రాలపై దృష్టి సారించింది. ఇప్పటికే ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది... వారికి ఇళ్లు, పెన్షన్లు, రేషన్‌కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంది...

hijra 04012018 3

ఈ పెన్షన్స, ఇల్లు, రేషన్ కార్డులు ఇచ్చేందుకు, హిజ్రాలను గుర్తించేందుకు ప్రభుత్వం నిర్ధిష్టమైన ప్రమాణాలను రూపొందించనుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం జన్మించినప్పుడు ఉన్న జెండర్‌కు వ్యతిరేకంగా వారి ప్రవర్తన తీరు ఉంటే వారిని ట్రాన్స్‌జెండర్‌గా పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్‌గా గుర్తింపు చెందాలంటే జిల్లా కలెక్టర్‌ ఏర్పాటుచేసిన స్ర్కీనింగ్‌ కమిటీ సర్టిఫికేట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కమిటీలో మెడికల్‌ ఆఫీసర్‌, సైకాలజిస్టు లేక సైక్రియాట్రిస్టు.. జిల్లా సంక్షేమాధికారి, ఒక ప్రభుత్వ అధికారి, ఒక ట్రాన్స్‌జెండర్‌ సభ్యులుగా ఉండాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read