గుజరాత్ ఎన్నికల ఫలితాలు రాగానే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీజేపీ నాయకుడు సోము వీర్రాజు ఎలా పేట్రేగిపోయాడు అందరూ చూసారు... అసలు అక్కడ బీజేపీ గెలిస్తే, ఇక్కడ ఈయన చంద్రబాబు మీద ఎందుకు రేచ్చిపోయాడో ఎవరికీ అర్ధం కాలేదు... అది బీజేపీ అభిప్రాయమా , సోము వీర్రాజు మనసులో ఉన్నది అంతా కక్కాడా అన్నది తెలీకి పోయినా, వీర్రాజు మాత్రం విర్ర వీగారు... ఎంతలా అంటే, కనీసం వార్డ్ మెంబెర్ కూడా గెలవలేని వ్యక్తి, నేను ముఖ్యమంత్రి అభ్యర్ధిని నిర్ణయిస్తాను అనే దాకా... సహజంగా ఈ మాటలకు ఇబ్బంది పడ్డ కొంత మంది టిడిపి నాయకులు సోము పై రియాక్ట్ అయ్యారు... అయితే వెంటనే చంద్రబాబు రంగంలోకి దిగి, అలాంటి వారిని లైట్ తీసుకోమన్నారు.... వారి అజెండా వేరు అని, ట్రాప్ లో పడొద్దు అని చెప్పారు...

veerraju 22122017 2

ఇది ఇలా ఉండగానే, సొంత పార్టీ నేతలే సోము వ్యాఖ్యలను తప్పు బట్టారు... ఇవాళ ఏకంగా మీడియా ముందుకు వచ్చి, వీర్రాజుని లెఫ్ట్ అండ్ రైట్ వాయించారు... ఆంధ్రప్రదేశ్ బీజేపీ కార్యవర్గ సభ్యుడు ఉంగరాల చినబాబు సోము వీర్రాజు పై బీజేపీ అధిష్టానికి ఫిర్యాదు చెయ్యటానికి ఢిల్లీ వెళ్లారు... పత్రికా సమావేశాలు, డిబేట్లలో చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా వాళ్ల వ్యక్తిగతమేనని అన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీ పరువు, ప్రతిష్టలను మంటగలపాలని చూస్తున్నారని, ఈ విషయంపై జాతీయ అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు.

veerraju 22122017 3

ఈ సందర్భంగా శుక్రవారం ఉంగరాల చినబాబు మీడియాతో మాట్లాడుతూ పార్టీకి సంబంధం ఉన్న, లేని వ్యక్తులు బీజేపీ నాయకుల గురించి విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, అవి వాళ్ల వ్యక్తిగతమని అన్నారు. వారిపై జాతీయ అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. వారు మీడియాలో కనబడాలనే ఉద్దేశంతో కాంట్రవర్స్ వ్యాఖ్యలు చేస్తున్నారని, వాళ్లకు అలా మాట్లాడే అర్హత లేదని ఉంగరాల అభిప్రాయపడ్డారు. ఏదైనా బీజేపీ అధిష్టానం చెప్పిన మాటే ఫైనల్ అని, ఇలాంటి వారి వ్యాఖ్యలు మీడియా కూడా పట్టించుకోవాల్సిన పని లేదు అని, సోము వీర్రాజు గాలి తీసిపడేసారు సొంత పార్టీ నేత...

Advertisements

Advertisements

Latest Articles

Most Read