వెంకయ్య నాయుడు, మొన్నటి వరకు కేంద్రంలో రాష్ట్రానికి కావాల్సిన సహాయం చేసిన కేంద్ర మంత్రి... తన సొంత శాఖలోనే కాక, మిగతా శాఖల్లో రాష్ట్రానికి సంబంధించిన పనులు చూసుకునే వారు... ఆయన ప్రాతినిధ్యం వహించిన పట్టణాభివృద్ధి శాఖలో చేతనైన సహాయం చేశారు... రాష్ట్రానికి ఇళ్ళ కేటాయింపు, అండర్గ్రౌండ్ డ్రైనేజికి నిధులు, అమరావతికి స్మార్ట్ సిటీ హోదా... ఇలా ఎన్నో పనులు చూసుకునే వారు... ఇలా ఉండగానే ఉప-రాష్ట్రపతిగా వెళ్ళిపోయారు... దీని వెనుక చాలా ఊహాగానాలు వినిపించాయి... ఏదేమైనా జరగాల్సింది జరిగిపోయింది... నష్టం మాత్రం రాష్ట్రానికి జరిగింది...
ఉప రాష్ట్రపతి అంటే ఎదో రబ్బర్ స్టాంప్ అనుకున్నారు... చెప్పింది ఊ కొట్టి, పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు అనుకున్నారు... రాజ్యసభని మైంటైన్ చేయటం అనుకున్నారు... కాని ఉప రాష్ట్రపతి హోదాలో అల్లాడిస్తున్నారు వెంకయ్య... పక్కన పడేసాం అనుకున్నారు కాని, వరుస పెట్టి రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ సమస్యల పై ఉప రాష్ట్రపతి హోదాలో రివ్యూ చేశారు... కేంద్ర మంత్రుల్ని, సీనియర్ అధికారులని పిలిపించుకుని అన్ని విషయాల పై చర్చించారు... ఉప రాష్ట్రపతి హోదాలో ఉంటూ, ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్ట్ గురించి, అదీ రాష్ట్ర బీజేపీ ప్రజా ప్రతినిధులను కూడా కూర్చోబెట్టుకుని, ఎలా సమీక్ష చేస్తారు అంటూ విమర్శలు వస్తున్నాయి... విమర్శలు, రూల్స్ ఎలా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, సమస్యల పై వెంకయ్య రంగలోకి దిగారు...
మొదటి రోజు పోలవరం పై సమీక్ష చేశారు... పోలవరం పురోగతిపై ఉప రాష్ట్రపతి హోదాలో వెంకయ్యనాయుడు సమక్షంలో సమీక్ష జరిగింది. ఢీల్లీలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, బీజేపీ ఎమ్మెల్య విష్ణుకుమార్ రాజు, రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రెండో రోజు కడప జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన ఉక్కు పరిశ్రమ పై రివ్యూ చేసారు... కేంద్ర మంత్రి సుజనాచౌదరి ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలో మంత్రి సోమిరెడ్డి పాటు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి, కడప జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సమక్షంలో కేంద్ర గనుల, ఉక్కు శాఖ మంత్రి చౌదరి వీరేంద్ర సింగ్, ఆ శాఖ కార్యదర్శి అరుణ శర్మ తదితరులో పార్లమెంటులో చర్చలు జరిపారు. ఈ నెల 27న మరో ధఫా సమావేశమై సమగ్రంగా చర్చించనున్నట్లు వెల్లడించారు.